లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
చైనాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. ఇవాళ ప్రధాని మోదీ అకస్మాత్తుగా లేహ్ వెళ్లారు.
అక్కడ ఆయన సైనికులతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం లడఖ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ..
అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వెళ్లారు.
చైనా మిలిటరీ అధికారులతో జరుగుతున్న చర్చల ప్రక్రియను కూడా ఆయన అడిగి తెలుసుకోనున్నారు.
వాస్తవానికి ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్‌ను మార్చేశారు.
దీంతో ఇవాళ ఉదయం మోదీ .. లడఖ్ చేరుకున్నారు.
ప్రధాని మోదీ వెంట.. త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్‌తో పాటు ఆర్మీ చీఫ్ నరవాణే ఉన్నారు.
Post a Comment