* నగర కమిషనర్ పి.విశ్వనాథ్
చిత్తూరు : వర్షాకాలం నేపథ్యంలో నగరంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ చెప్పారు. గురువారం ఉదయం నగర కమిషనర్ సంతపేట, బజార్ వీధిలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య, ఫాగింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రధానంగా వ్యాధులు వ్యాపించేందుకు కారణమైన దోమలు, దోమలు లార్వాలను నాశనం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయడానికి షెడ్యూల్ రూపొందించామని.. మీ షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఫాగింగ్ జరిగేలా చూస్తామన్నారు. పగటిపూట ప్రస్తుతం రెండు గంటలు ఫాగింగ్ చేస్తున్నారని... ఇకపై 3గంటలకు పెంచుతున్నట్లు చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటి నిల్వలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేయాలన్నారు.
* మస్టర్ పాయింట్ తనిఖీ...
గురువారం ఉదయం నగర కమిషనర్ పి.విశ్వనాథ్ నాగయ్య కళాక్షేత్రం మస్టర్ పాయింట్ ను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు ను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ నగరపాలక సంస్థ వాహనాల షెడ్డు ను తనిఖీ చేశారు.
Post a Comment