కరోనా తో సహజీవనం తప్పనిసరి.. ప్రజల రక్షణతో బాటు మన రక్షణ కూడా ముఖ్యం.. ఉద్యోగ నిర్వహణలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి - నేర సమీక్షా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సెంధిల్ కుమార్...
చిత్తూరు పోలీసు గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు చిత్తూరు సబ్ డివిజన్ నెల వారి నేర సమీక్షా కార్యక్రమమును చిత్తూరు ఎస్పీ నిర్వహించారు. ఎస్పీ గారు నేర సమీక్షా కార్యక్రమము నందు సమీక్షిస్తూ జిల్లా నందు విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా, ప్రత్యేక కార్యాచరణాలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ను అమలుపర్చాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో గట్టిగా పనిచేయాలని, ఇతర రాష్ట్రాలకు తరలి పోకుండా నిరంతర ఉంచాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని తెలిపారు. ఎర్రచందనం కేసులపై ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో మరియు నాన్-బైలబుల్ వారంట్స్ (N.B.W) ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని, DIAL 100 కాల్స్, పెండింగ్ లో ఉన్న UI, PT, గ్రేవ్ కేసులు మరియు హత్యలు, మిస్సింగ్ కేసులు, దోపిడీ దొంగతనాలు, POCSO కేసులను తదితర కేసులను లోతుగా సమీక్ష చేశారు. కేసులను త్వరిత గతిలో నేర పరిశోధన చేసి పరిష్కరించవలసినదిగా ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో పురోగతిపై సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నాదని ఈ విపత్కాలం లో ప్రజలతో మన ప్రవర్తన ఆదర్శనీయంగా వుండాలని, ప్రజల రక్షణతో బాటు మన, మన కుటుంబ రక్షణకు కూడా ముఖ్యం అని, ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్తలకు తావ్వివకుండా ఉద్యోగ నిర్వహణ చేయాలని, స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు.
Post a Comment