ప్రయోజనం లేని
లాక్ డౌన్ ఇది
ఇది కార్పొరేట్ వర్గాలు
నిర్ణయించిన లాక్ డౌన్
వ్యాపారులే నిర్ణేతలు
అధికారుల మాటలకు
విలువ లేదు
ప్రతిపక్షాల , ప్రజాసంఘాల
ఊసే లేదు
ప్రజావాణి వినపడలేదు
-----------------------------------------------
కావలిలో 31వ తేదీ నుండి ఆగస్టు 9 వ తేదీ వరకు 10 రోజుల పాటు లాక్ డౌన్ వేళలు కుదించే విధంగా - మంగళవారం మధ్యాహ్నం ఆర్డీఓ ఆఫీస్ లో జరిగిన సమావేశం నిర్ణయించింది . ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి , వ్యాపారసంస్థల యజమానులతో , వైస్సార్సీపీ నాయకులతో అధికారులు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు . రోము నగరం తగలబడి పోతుంటే ఫిడేలు వాయిస్తూ వున్న నీరో చక్రవర్తి వారసులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలా ఈ సమావేశం అగుపించింది . ప్రజలను , మేధావి వర్గాలను ప్రతిపక్షాలను , ప్రజాసంఘాలను పిలవకుండా కార్పొరేట్ వర్గాలతో జరిపిన సమావేశంగా ఇది దర్శనమిచ్చింది . సమావేశంలో కావలి ఆర్డీఓ దాసు కోవిడ్ సెంటర్ల వివరాలు చెప్పడానికి పరిమితం కాగా - మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదన్న విషయాలకే పరిమితయ్యాడు .
ఇక డీఎస్పీ ప్రసాద్ అయితే సంపూర్ణ లాక్ డౌన్ 10 రోజుల పాటు కఠినంగా ఉదయం 6 గంటలనుండి 9 గంటలవరకు అమలు చేద్దామని చెప్పాడు . శనివారం , ఆదివారం అసలు పూర్తిగా లాక్ డౌన్ విధించి ప్రజల్ని ఇళ్లకే పరిమితి చేద్దామన్నారు . ఇలాచేస్తే కరోన నియంత్రణ కొంతవరకు సాధ్యపడుతుందని బాధాతప్త హృదయుడై డీఎస్పీ చేసిన రోదన అరణ్యరోదనే అయ్యింది . ఆయన చెప్పిన వేళలు పట్టించుకున్న నాధుడు లేకుండా పోయాడు . శనివారం , ఆదివారం పూర్తి లాక్ డౌన్ కు మాత్రం అతికష్టంగా సమావేశం అంగీకరించింది . సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు ఎక్కువ భాగం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉండాలని కోరగా , కొద్ది మంది మాత్రం 7 నుండి 11 వరకు కోరారు . వైస్సార్సీపీ నాయకులు , మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ మాట్లాడుతూ - తానూ వ్యాపారస్తుడనే కానీ కావలి పట్టణంలో కరోన మహమ్మారి విజృంభణ అధికంగా వున్నందున ఉదయం 6 నుండి 9 వరకు పూర్వం లాగా సంపూర్ణ లాక్ డౌన్ విధించి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించాడు . ఆయన సూచన సూచనగానే మిగిలింది .
7 గంటల నుండి 11 గంటలవరకు మాత్రమే లాక్ డౌన్ వేళలు కుదించాలని ఎక్కువ మంది వ్యాపారులు కోరిన కోరికకు ఎమ్మెల్యే పచ్చజెండా వూపాడు . శనివారం , ఆదివారం పూర్తి లాక్ డౌన్ కు ఎమ్మెల్యే ఆమోదముద్ర వేసాడు .
ప్రతిపక్షాలను , ప్రజాసంఘాలను , ప్రజలను , మేధావి వర్గాలను పిలిచి
సమావేశంలో భాగస్వాముల్ని చేద్దామన్న ఆలోచనే అధికారులు చేయకపోవడం దారుణం .
ఈ వేళల కుదింపు లాక్ డౌన్ వలన సాధించే ప్రగతి ఏమీ ఉండదు గాక ఉండదు . ప్రజల , ప్రతిపక్షాల గగ్గోలుకు తట్టుకోలేక కంటితుడుపుగా పెట్టిన సమావేశమే గాని - ప్రజల్ని ఉద్ధరించడానికి పెట్టింది మాత్రం కాదు .

Post a Comment