వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిని పరిశీలించిన సీబీఐ బృందం
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ నాలుగోరోజు కొనసాగుతోంది. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్న ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విచారణ చేపట్టింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు .. వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు.
2019 మార్చి 15న పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సిట్ అధికారుల దర్యాప్తు నివేదికను పరిశీలించారు. ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ ప్రముఖులు, వైకాపా, తెదేపా నాయకులు, అనుమానితులను కలిపి మొత్తం 1300 మందిని విచారించారు. ఆ విచారణ నివేదికను సీబీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు రెండో రోజు కూడా ఇంటిని పరిశీలిస్తున్నారు. వివేకా హత్యకు గురైన పడక, స్నానపు గదులను పరిశీలించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ సర్వేయర్ ద్వారా ఇంటి కొలతలు వేయించారు. ఇంటికి ఎన్ని గదులు, కిటికీలు ఉన్నాయని క్షుణ్నంగా పరిశీలించారు.

Post a Comment