ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై డీఈవో చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ డిమాండ్
ఏడీ విజయలక్ష్మి గారికి వినతి పత్రం అందించిన ఏబీవీపీ నేతలు
విషయం : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో ఏడీ-1 విజయలక్ష్మి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల వల్ల ప్రజలు అందరూ ఇబ్బంది పడుతుంటే ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు వారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం పై మండిపడ్డారు. ఇంతవరకూ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన తరగతి తేదీలు ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఇదే అనువుగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి ధనార్జనే ధ్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్నారు. అదే విధంగా పుస్తకాలు కొనాలి అంటూ తల్లిదండ్రులను వేదనకు గురి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుల్లేక ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల దందాను ఆపకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
నగర కార్యదర్శి జస్వంత్ సింగ్ మాట్లాడుతూ డీఈవో గారు వెంటనే అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలల పై ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు మరియు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల సమస్యలను తెలుసుకునేందుకు వారికి అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
Post a Comment