శానిటైజర్ తాగి 8మంది మృతి
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగిఎనిమిది మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి నేపథ్యలో మద్యం దుకాణాలు మూసి ఉండటంతో పలువురు యాచకులు నిన్న శానిటైజర్ తాగారు.నిన్న అర్థరాత్రి వరకూ ముగ్గురు మృతి చెందగా చికిత్స పొందుతూ ఈ ఉదయం మరో ఐదుగురు మృతి చెందారు. మృతులను కడియం రమణయ్య, రాముడు, శ్రీను, తిరుపతయ్య లతో పాటు మరో ముగ్గురు యచకులుగా గుర్తించారు. కురిచేడులో లాక్ డౌన్ అమలులో ఉన్నందున మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శానిటైజర్ తాగడం వల్ల మృతి చెందారా.. కల్తీ మద్యం ఏమైనా సేవించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Post a Comment