కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్ ఉండదని, కరోనా మృతుల అంత్యక్రియల్లో ఇబ్బందులు పెట్టొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సూచించారు. ఒక్క కరోనా మృతి ఉంటే 666 కేసులు ఉన్నట్టు లెక్క అని చెప్పారు. అంతర్రాష్ట్ర రవాణా వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందని, కరోనా వ్యాప్తి రెండు దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టేనని పేర్కొన్నారు. వైద్యలపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి చెప్పారు.
Post a Comment