లాక్ డౌన్ తరువాత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కరోనా వైరస్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటైంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద అధికారులు కరోనా పరీక్షలను మొబైల్ యూనిట్ ద్వారా నిర్వహిస్తున్నారు. అధికారులు దారిగుండా వెళ్లే వాహనాలను ఆపి వాహనదారులకు పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారితో పాటు లేనివారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. కాగా వారందరికీ 20 నిమిషాలలో పరీక్షలు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత వాతావరణంలో అధికారులు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేనివారికి మాత్రం ర్యాండమ్ శాంపిల్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న (గురువారం) ఒక్క రోజే అత్యధికంగా 352 కేసులు నమోదు కాగా.. నిన్న కూడా అత్యధికంగా 499 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 329 కేసులు నమోదు చేసుకున్నాయి.రాష్ట్రంలో నిన్నటివరకు కరోనాతో పోరాడి 198 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6526 కి చేరింది. నిన్నటి వరకు కరోనాతో పోరాడి 3352 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2976 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 13,586 కేసులు నమోదు కాగా, 336 మంది ప్రాణాలు విడిచారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,80,532 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,63,248 ఉండగా, 2,04,710 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 12,573 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Post a Comment