కృష్ణపట్నం పోర్టులో కార్మిక హక్కులకు రక్షణ, ఉద్యోగ భద్రత కల్పించాలి : సిఐటియు


కృష్ణపట్నం పోర్టులో కార్మిక హక్కులకు రక్షణ, ఉద్యోగ భద్రత కల్పించాలి : సిఐటియు


కృష్ణపట్నం పోర్టులో కార్మిక హక్కులకు రక్షణ, కార్మికులకు పని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,

పోర్టు కొత్త యాజమాన్యం ఏకపక్ష విధానాలను విడనాడాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.

మంగళవారం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా హరనాథపురం సెంటర్లో సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నాగేశ్వరరావు, కె అజయ్ కుమార్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టును నవయుగ సంస్థ నుండి అదాని సంస్థ కొనుగోలు చేసినప్పటి నుండి ఉద్యోగులకు ఉద్యోగు భద్రత, కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని అన్నారు. 

నవయుగ యాజమాన్యం కింద పనిచేస్తున్న పదివేల మంది పైగా కార్మికుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకమైందని అన్నారు.

ప్రభుత్వం నుండి కాని, యాజమాన్యం నుండి కాని వీరికి ఎటువంటి హామీ ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు.

పోర్టు ఏర్పడిన పోటు నుండి పనిచేస్తున్న వీరిని యాజమాన్యం ఎప్పటికైనా పర్మినెంట్ చేయక పోతుందా అని ఎదురు చూపులు చూశారు.

కాని పోర్టు యాజమాన్యం మారడంతో వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయని అని అన్నారు.

పోర్టు నిర్మాణం కోసం భూములు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్వాసితులైన వారికి,

సర్వ వృత్తులను పోగొట్టుకున్న వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలు పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న పనిని కూడా పీకేసే పనిలో కొత్త యాజమాన్యం ఉందన్నారు.

యాజమాన్యాల మధ్య లావాదేవీలకు సంబంధించిన అగ్రిమెంట్లు జరిగిన కార్మికుల కొనసాగింపు ఉద్యోగ రక్షణ కార్మిక హక్కులకు సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ జరిగిందో యాజమాన్యం నేటికీ బయటకు పెట్టలేదన్నారు. కార్మిక హక్కులకు సంబంధించి,

ఉద్యోగుల పని భద్రతకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు జరిగాయో బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

పోర్టు ఏర్పడినప్పటి నుండి పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఆదాని సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలని వారి సర్వీస్ బ్రేక్ కాకుండా,

సర్వీస్ కండిషన్స్ లో మార్పు లేకుండా కార్మికులందరినీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యం వెంటనే కార్మికులు,

కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి రాతపూర్వక అగ్రిమెంట్ చేసుకోవాలని, దీనికి ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్ ప్రధాన కార్యదర్శి ఎం మోహన్ రావు,

ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు కె రాంబాబు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటే శ్వర్లు,

నాయకులు ప్రసాద్, ఓపిడిఆర్ నాయకులు శివశంకర్, సిఐటియు కృష్ణపట్నం పోర్టు కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య,

అల్లాడి గోపాల్, టివివి ప్రసాద్, షేక్ రెహనా బేగం, కె సురేష్, కొండ ప్రసాద్, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget