నెల్లూరు నగరంలోని రంగనాయకులు పేట, సుబేదార్ పేట, రైల్వేస్టేషన్ గేట్, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఫైర్ ఆఫీస్, ఆర్.టి.సి బస్టాండ్ లలో..., శుక్రవారం ఉదయం కలెక్టర్ శ్రీ ఎం.వి.శేషగిరి బాబు, మున్సిపల్ కమీషనర్ శ్రీ బాపిరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నగరంలో డ్రైనేజీ సిస్టమ్స్ నిర్వహణ, కాలువలు ఎలా శుభ్రం చేస్తున్నారు, వార్డులలో తీసుకుంటున్న పారిశుధ్య చర్యలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మురుగుకాల్వలో ప్రొక్లైన్లతో శుభ్రం చేస్తున్నామని, ప్రతిరోజూ వీధుల్లో బ్లీచింగ్ చల్లడంతో పాటు.., ప్రతిరోజూ పారిశుధ్య నివారణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆర్.టి.సీ బస్టాండ్ ని పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో తిరుగుతూ.., పరిసరాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలపై ఆర్.టి.సి. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బస్ లో టిక్కెట్ ఇచ్చే సమయంలోనూ.., బస్ లో ప్రయాణికులు ప్రయాణించే సమయంలోనూ సానిటైజర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. బస్ లో కూడా ప్రయాణికుల సీట్ల మధ్య దూరం పాటించేలా నిబంధనల ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఉప సంచాలకులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది.

Post a Comment