*పెరుగుతున్న కరోనా ఉధృతి*
చిత్తూరు........
చిత్తూరు నగరంలో శనివారం ఒక్కరోజే మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కొంగారెడ్డి పల్లిలోని ఆంధ్రబ్యాంక్ నందు పనిచేస్తున్న ఒక మహిళకు ఆమె నివాసం ఉంటున్న పెద్ద హరిజనవాడ వార్డ్ నెంబర్ 39 నందు మరో పురుషుడికి,పంజాబ్ నేషనల్ బ్యాంక్ నందు పనిచేస్తున్న వ్యక్తికి, 21వ వార్డు కుక్కల పల్లిలో మహిళకు,చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో ఉన్నా ప్రధాన తపాలా కార్యాలయంలో ఓ ఉద్యోగికి,26వ వార్డు జాన్సన్ గార్డెన్ లో ఉన్న ఒక పోలీసుకు కారోనా పాజిటివ్ రావడంతో కంటోన్మెంట్ జోన్ ను పరిశీలిస్తున్న చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, శనివారం ఉదయం కారోనా పాజిటివ్ నిర్ధారణ సంబంధిత కంటోన్మెంట్ ఉన్న జోన్లలో వైరస్ నియంత్రణ కోసం బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగినది.అలాగే పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టర్లను వేగంగా గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు.వీరు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా హోం క్వారంటైన్లో ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సీఐలు భాస్కర్ రెడ్డి, యుగంధర్, నగరపాలక ప్రజా ఆరోగ్య అధికారి వినోద్ కుమార్, ప్రణాళిక అధికారి నాగేంద్ర, సానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఉన్నారు.
Post a Comment