కరోనా చికిత్సకు ఔషధం విడుదల

కరోనా చికిత్సకు ఔషధం విడుదల
ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు తెలిపింది.
ధర ఎంతంటే?
దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్‌మార్క్‌ ఛైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా అన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు  800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల్సి ఉంటుందన్నారు. 
డయాబెటిక్‌ పేషెంట్లూ వాడొచ్చు
కరోనాపై ఫాబిఫ్లూనే తొలి ఓరల్‌ డ్రగ్‌ అని ముంబయికి చెందిన ఈ గ్లెన్‌మార్క్‌ ఫార్మా సంస్థ వెల్లడించింది. దేశంలో ఎన్నడూ లేనంతగా కేసులు పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో ఈ అనుమతులు లభించాయని ఆ సంస్థ ఛైర్మన్‌  గ్లెన్‌ సల్దన్హా తెలిపారు. ఈ ఔషధాలతో చికిత్స ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.  క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్న మధుమేహ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు సైతం ఈ ఔషధాన్ని వాడవచ్చన్నారు. ఈ ఔషధం కేవలం నాలుగు రోజుల్లోనే వైరల్‌ లోడ్ తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget