ఏపీలో కరోనా కల్లోలం... హైకోర్టు కీలక ఆదేశాలు !


ఏపీలో కరోనా కల్లోలం... హైకోర్టు కీలక ఆదేశాలు !

★ ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో హైకోర్టు తమ ఉద్యోగులకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

★ హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం విడిచి వెళ్లకూడదని, వెళితే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్ట్ రిజిస్ట్రార్‌ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

★ ఇక అధికారుల అనుమతితో వేరే రాష్ట్రానికి వెళ్లిన వారు విధుల్లోకి తిరిగి వచ్చే ముందు క్వారంటైన్‌ లో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

★ కోర్టు విధుల్ని ముగించుకున్న సిబ్బంది ఎటూ వెళ్లకుండా నేరుగా ఇంటికే వెళ్లాలని ఆదేశించింది.

★ హైకోర్టు ప్రవేశమార్గం దగ్గర థర్మల్ స్ర్కీనింగ్‌ చేయించుకొని మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు.

★ అధికారిక పని ఉన్నప్పుడు తప్ప హైకోర్టు వరండాలో, వివిధ విభాగాల్లో, భోజన సమయంలో ఒకే చోట చేరడాన్ని ఇప్పటికే నిషేధించారు.

★ హైకోర్టు ప్రాంగణంలో ఉమ్మివేయడాన్ని కూడా నిషేధించారు.

★ కార్యాలయ పని, భోజన సమయంలో తప్ప, పని వేళల్లో సిబ్బంది ఎవరైనా సీటులో లేరని గుర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

★ కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో నివసించే అధికారులు, సిబ్బంది రాతపూర్వకంగా నియంత్రణ అధికారికి ఆ వివరాలు సమర్పించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget