కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోపలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి.

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించి, సుమారు 4 కోట్ల 64 లక్షల రూపాయలతో  చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి




కృష్ణపట్నం గ్రామ పర్యటనలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాకాణి.

కృష్ణపట్నం సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశమై, ప్రభుత్వ పథకాలను ప్రజలకు  అందిస్తున్న తీరుతెన్నులపై సమీక్షించిన ఎమ్మెల్యే కాకాణి.

ముత్తుకూరులోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించి, పారిశుద్ధ్య నిర్వహణ తదితర పనులను పరిశీలించి, అధికారులకు, స్థానిక  ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకాణి.

స్క్రోలింగ్ పాయింట్స్:

 👉గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరమైన  అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం.

👉ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.

👉చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష శాసన సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని పరిస్థితి.

👉వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో 180 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మొదలగు నిర్మాణాలను చేపట్టాను.

👉నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నివసించే ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాము.

👉టిడిపి హయాంలో అభివృద్ధి అంటే శిలాఫలకాలు తప్ప, అభివృద్ధి కనిపించని పరిస్థితి.

👉ఎన్నికలప్పుడు శిలాఫలాకాలు వేసి మభ్యపెట్టి, ఓట్లు దండుకునేందుకు చూశారు.

👉జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో వేసి వెక్కిరిస్తున్న శిలాఫలాకాలకు సంబంధించిన పనులకు నిధులిచ్చి, ప్రారంభించి, పూర్తి చేశాం.

👉సంక్షేమ పథకాలన్నీ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుంది.

👉అర్హులైన ప్రతి ఒక్క  కుటుంబానికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాం.

👉చంద్రబాబుకు ఏమీ మాట్లాడాలో తెలియక, భవనాలకు రంగుల గురించి రాద్దాంతం చేస్తున్నాడు.

👉గతంలో ఇక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తి అడ్డంకులు సృష్టిస్తూ, పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకోవాలని చూస్తున్నాడు.

👉ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అందిస్తాను.

👉కరోనా ప్రబలుతున్న కారణంగా ప్రజలందరూ అధికారుల సూచనలను పాటిస్తూ, ఇళ్లకే పరిమితమవ్వాలి.

👉మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లవేళలా పర్యవేక్షిస్తూ, మీ అందరికి అందుబాటులో ఉంటాను.

👉మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget