నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు, ఏపీ జి ఈ ఎ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నెల్లూరు లోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిణి ప్రత్యేకించి ఒక వికలాంగురాలు ఉషారాణి పై జరిగిన దాడి ఘటనను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఖండించింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ చొప్పా. రవీంద్ర బాబు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 విజృంభిస్తున్న ఈ టైం లో మాస్కు పెట్టుకోమని చెప్పినందుకు దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా ఒక మహిళా ఉద్యోగిని కుర్చీలో నుండి కింద పడవేసి కొట్టడం దుర్మార్గమన్నారు. ఒక డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి భాస్కర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. టూరిజం అధికారి భాస్కర్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ రాజేశ్వరి జిల్లా చైర్మన్ సౌందర్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా వింగ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ సంఘోజు. రాజేశ్వరి, జిల్లా మహిళా చైర్మన్ సౌందర్య, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మఘమ్మ , జిల్లా నాయకులు ఏనుగు. రమణారెడ్డి చేజర్ల సుధాకర్ రావు, మల్లికార్జున రావు, సూర్య ప్రకాష్ రావు తదితరులు
పాల్గొన్నారు.
పాల్గొన్నారు.
Post a Comment