♦️ *మహా నగరాలకు ధీటుగా పట్టణ లేఅవుట్లు*
*♦️ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు నెరవేరనున్న సొంత ఇంటి కల*
*♦️పురపాలక శాఖ పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ మోహన్*
♦️ *గూడూరు మునిసిపల్ కార్యాలయంలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు పై కమీషనర్ ఓబులేషు తో సమీక్ష,లే అవుట్ల పై పరిశీలన*
నగరాలు చెన్నై,* *హైదరాబాద్,ముంబై,తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లే అవుట్లు తో సమానంగా గూడూరు పురపాలక పరిధిలోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ నవశకం కాలనీ లే అవుట్ ను తీర్చి దిద్దినట్లు పురపాలక శాఖ జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ టి. మోహన్ వెల్లడించారు , గూడూరు* *పురపాలక సంఘం పరిధిలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గాంధీనగర్ లో ప్రభుత్వం ప్రత్యేక లే అవుట్లను నిర్మించి నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతోంది.స్థానిక గాంధీనగర్ లేఅవుట్ ను మంగళవారం ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రత్యేక* *అధికారి,పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ టి.మోహన్, మునిసిపల్ కమీషనర్ ఓబులేషు తో కలిసి పరిశీలించారు.అనంతరం పురపాలక సంఘం కమీషనర్ ఛాంబర్ లో విలేకర్ల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు.గూడూరులో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ఒక వరంగా బావించలన్నరు.4250 ప్లాట్లను లే అవుట్ లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని వాస్తు* *ప్రకారం లే అవుట్ తీర్చిదిద్ద మన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే మార్చి నెలలో లేఅవుట్ పనులు ప్రారభమయ్యాన్నారు.అతి తక్కువ కాల వ్యవధిలో లే అవుట్ లో ప్లాట్లు అందుబాటులోకి తీసుకుని* *వచ్చామని తెలిపారు.156 ఎకరాల విస్తీర్ణంలో 139 ఎకరాల్లో ప్లాట్లు వేయడం జరిగిందని తెలిపారు.4230 అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉందని జూలై 8 న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థలాల కేటాయింపు ప్రక్రియకు రాష్ట్ర వ్యాపితంగా శ్రీకారం* *చుడతున్నారని తెలిపారు.670 స్కోయార్ ఫీట్లు తో 9 అంకణముల స్థలం కేటాయించడంజరుతుందన్నరు.లే అవుట్ నందు మెయిన్ రోడ్డు 40 అడుగులు కలిగి అంతర్గత రోడ్లు 30 అడుగులతో నిర్మాణం జరిగిందన్నారు.కమీషనర్ ఓబులేసు మాట్లాడుతూ ఇంటి స్థలం* *కేటాయించిన వెంటనే కాలనీ ఇళ్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేదలకు ఇది వరంగాబావించాలన్నారు.అర్బన్ పరిధిలో 3718 ప్లాట్లు,దివిపాలెం పరిధిలో ఉన్న 576 లబ్ధిదారులకు ప్లాట్ కు కేటాయిస్తున్నట్లు తెలిపారు.గూడూరు ఒకటో పట్టణం నుంచి గాంధీనగర్* వైపు *నిర్మాణంలో వున్న ఫ్లైవోవర్ నిర్మాణం పూర్తయితేగాంధీనగర్,చవట పాలెం,దివి పాలెం ప్రాంతాలలో తిరుగులేని అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గూడూరు పురపాలక సంఘం ఇ.ఇ జె.వెంకటేశ్వర్లు,సిబ్బంది పాల్గొన్నారు.*
Post a Comment