కనకదుర్గ అమ్మవారికి మొదటి సారే.... మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు

శ్రీ  దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ: ఆషాడ మాసం ప్రారంభం సందర్భముగా ఈరోజు అనగా ది:22-6-2020 మొదటి రోజున ఉదయం 8-30 ని.లకు దేవస్థానం తరపున గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు, ధర్మకర్తల మండలి చైర్మెన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు వార్లు శ్రీ కనకదుర్గ అమ్మవారికి మొదటి సారే సమర్పించడం జరిగినది.
అనంతరం గౌరవనీయులైన మంత్రివర్యులు మాట్లాడుతూ దేవస్థానము తరుపున ఈరోజు అమ్మవారికి సారే
సమర్పించడము జరిగినదని తెలిపారు. 
ప్రస్తుత పరిస్ఠితుల దృష్ట్యా  శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించ దలచిన భక్తులు ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు ఆన్ లైను(www.kanakadurgamma.org) ద్వారా టైం స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు తీసుకొని బృందములుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా రావలసిందిగా తెలిపారు.

అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు  మాట్లాడుతూ శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించ దలచిన భక్తులు ప్రతి ఒక్కరికి ఆన్ లైను(website: www.kanakadurgamma.org, ఆండ్రాయిడ్ మొబైల్ APP : kanakadurgamma), మీ-సేవ సెంటర్లు  ద్వారా టైం స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు తీసుకొని ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు బృందములుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా విచ్చేసి, అమ్మవారికి సమర్పించదలచిన సారే, మడుపులు సమర్పించవచ్చునని తెలిపారు. ఆలయ ప్రాంగానములందు శానిటైజర్లు, మరియు ఇతర ఏర్పాట్లు చేయడమైనదని తెలిపారు. మరియు అమ్మవారి ఖడ్గామాలార్చన యందు పాల్గొనుటకు (అంతరాలయము వెలుపల) 4 , శ్రీచక్రనవావర్నార్చన సేవకు 5 జంటలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

  అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మాట్లాడుతూ శ్రీ  ఆషాడ మాసం ప్రారంభం సందర్భముగా ఈరోజు దేవస్థానం తరపున గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు, ధర్మకర్తల మండలి చైర్మెన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు వార్లు శ్రీ కనకదుర్గ అమ్మవారికి మొదటిగా  సారే సమర్పించడం జరిగినదని తెలిపారు.అమ్మవారికి అషాడం సారె సమర్పించదలచిన భక్తులు ప్రతి ఒక్కరికి ముందుగా ఆన్ లైను(www.kanakadurgamma.org) ద్వారా టైం స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు పొంది ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు బృందములుగా కాకుండా మహామండపం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారు తెలిపిన నియమనిభందనలు ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా విచ్చేసి, అమ్మవారికి సమర్పించదలచిన సారే, మడుపులు సమర్పించవచ్చునని తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget