పార్టీలకతీతంగా జర్నలిస్ట్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష, ప్రజాసంఘ నాయకులు
కావలి పట్టణంలో నేడు జరిగినటువంటి జర్నలిస్టు క్లబ్ ప్రారంభోత్సవ వేడుకలలో కావలి నియోజక వర్గానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జర్నలిస్టు క్లబ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు..
అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టు క్లబ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా మీడియా పనిచేయాలని, ఎవరైనా తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయోందుకు ఈ జర్నలిస్టు క్లబ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు.
మీడియా మిత్రులు ప్రస్తుత పరిస్ధితులలో కష్టనష్టాలను ఎదుర్కుంటునప్పటికీ వృత్తే ధ్యేయంగా పని చేయడం ప్రజల పక్షాణ నిలబడడం సమాజానికి స్రేయస్కరం అన్నారు..
గౌరవ శాసన సభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
జర్నలిస్టు క్లబ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, తప్పు ఏ పార్టీ వారు చేసిన నిజాలను నిర్భయంగా వ్రాసి మీడియా పాత్రను పోషించాలని కోరారు.. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారికి అన్ని వేలలా సహాయపడతానని కోరారు..
త్వరలో జర్నలిస్టులందరికీ ఫ్లాట్లు ఇస్తామని అన్నారు..
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని అలాగే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేసి సమస్యలను పరిష్కరించే విధంగా తోడ్పడాలని అన్నారు.
ఫైలాన్ విషయంలో అధికార పార్టీని దోషిని చేస్తూ రాసిన కొన్ని వార్తలు బాధించాయిని, కానీ పైలాన్ ఎవరో దుండగులు రాత్రికి రాత్రి పడగొట్టడం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
Post a Comment