పతంజలి విడుదల చేసిన కరోనా మందుపై కేంద్రం కీలక ప్రకటన.

పతంజలి విడుదల చేసిన కరోనా మందుపై కేంద్రం కీలక ప్రకటన..

కోవిడ్-19కు ఆయుర్వేద మందును కనిపెట్టినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19ను నయం చేసే మందుగా పతంజలి చెప్పుకొస్తున్న ఈ మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థను ఆదేశించింది. ఈ మందుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను.. ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో, ఈ మందు వేటితో తయారైందో, శాంపిల్ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. పతంజలి తయారుచేసిన కొరోనిల్ వాడితే రెండు వారాల్లో కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. 150కి పైగా ఔషధ మొక్కలను ఈ మందును తయారుచేసేందుకు వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. ఈ కరోనా కిట్ ధరను 545 రూపాయలుగా నిర్ణయించినట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలక్రిష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. పతంజలి స్టోర్ట్స్ లో మాత్రమే ఈ మందు దొరుకుతుందని సంస్థ ప్రకటించింది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget