థర్మల్‌ స్కానింగ్‌ చేసే సిబ్బందికి వైరస్‌ వ్యాపించకుండా 'బ్లూసెమీ'

కొవిడ్‌ కట్టడిలో భాగంగా థర్మల్‌ స్కానింగ్‌ చేసే సిబ్బందికి వైరస్‌ వ్యాపించకుండా 'బ్లూసెమీ' అంకుర సంస్థ వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని టీ హబ్‌ వేదికగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐవోటీ సాంకేతికతతో 'కాంటాక్ట్‌ లెస్‌, వైర్‌లెస్‌ థర్మల్‌ స్కానర్‌'ను రూపొందించింది. సంస్థ వ్యవస్థాపకుడు సునీల్‌కుమార్‌, 9 మంది బృందంతో కలిసి 2 నెలల వ్యవధిలో ఈ సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు.'ప్రవేశ ద్వారాల వద్ద ఈ పరికరాన్ని ఏర్పాటు చేస్తే చాలు. 15 సెం.మీల దూరం నుంచే వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత, దూరం వివరాలను అందజేస్తుంది. నిర్ణీత ఉష్ణోగ్రతకు మించి నమోదైతే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. డిజిటల్‌ యాప్‌ ద్వారా చరవాణికి లేదా సంబంధిత సంస్థ కంప్యూటర్‌లోకి ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. వ్యక్తిగతంగా, ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో వినియోగించేలా ఈ పరికరాన్ని రూపొందించాం. ' అని సునీల్‌ వివరించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget