అమరావతి : ఏపీ రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం వెలువడిన ఫలితాల్లో ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాశ్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఆయనకు కేవలం 17ఓట్లుమాత్రమే వచ్చాయి. ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు పోటీ చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని 175మంది ఎమ్మెల్యేలకు 170మంది ఓటేసినట్లు సమాచారం. జనసేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ అధికార పార్టీకి ఓటేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయన జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Post a Comment