తిరుపతిలో చైనా వస్తువులు తగలబెట్టిన బీజేపీ నాయకులు
భారత్ చైనా బోర్డర్ టెన్షన్ తో భారత్ లో చైనాపై ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రాగన్ కంట్రీ చైనాపై నిరసనలు మిన్ను ముడుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోటోలను దగ్దం చేయడంతో పాటు చైనా వస్తువులను నిషేధించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ బ్యాన్ చైనా ఉద్యమం ఉధృతంగా సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిరసనలు వెల్లువగా మారాయి. తిరుపతిలోనూ చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు బీజేపీ నాయకులు . చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను బీజేపీ నేతలు తగలబెట్టారు. ప్రజలెవరూ చైనా వస్తువులను వాడొద్దని పిలుపునిచ్చారు.
ఇక చైనా దేశపు వస్తువులను బహిష్కరించడం ద్వారా జిత్తులమారి చైనాకు ఆర్థికంగా బుద్ధి చెబుదామని అన్నారు. ఇక ఇప్పటికే బీజేపీ నేతలు , బీజేపీ మిత్ర పక్ష పార్టీలు కూడా చైనాకు బుద్ధి చెప్పాలని నినదిస్తున్నాయి. ఇక నిన్న నిర్వహించిన అఖిల పక్ష భేటీలో కూడా చైనాను ఆర్ధికంగా దెబ్బ కొట్టాలని పెద్ద ఎత్తున చర్చ జరిపారు. ఇక ఈ నేపధ్యంలో చైనా యాప్స్ , చైనా వస్తువులే కాదు, చైనా కంపెనీలకు కాంట్రాక్టులు కూడా ఇవ్వకుండా ఆర్ధికంగా దెబ్బ కొడితే చైనాకు బుద్ధి వస్తుందని అంటున్నారు . ఇక ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా చైనా ప్రొడక్ట్స్ దగ్ధం చేస్తున్నారు.
Post a Comment