శ్రీకాళహస్తి మినహా ఆలయాల మూసివేత....సూర్యగ్రహణ ప్రభావం

సూర్యగ్రహణ ప్రభావం.. శ్రీకాళహస్తి మినహా ఆలయాల మూసివేత

ఇవాళ ఖగోళ అద్భుతం జరగబోతోంది.. ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడుతోంది. ఈ గ్రహణం పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 9.16 గంటల నుండి మధ్యాహ్నం 3.04 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు.భారత్‌లో ద్వారక గుజరాత్ రాష్ట్రంలో మొదట గ్రహణం చూస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. గ్రహణం సందర్భంగా దేశంలో ఆలయాలన్నీ పూర్తిగా మూసివేస్తున్నారు. సూర్యగ్రహణం కారణంగా శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం మూసే శ్రీవారి ఆలయ తలుపులు ఆదివారం మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు తెరుస్తారు. ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఇటు ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చిన్న వెంకన్న స్వామి వారి ఆలయం సూర్య గ్రహణం సందర్భంగా యధాతధంగా ఆలయం మూసి వేస్తారు. అనంతరం తిరిగి ఆదివారము శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి తెరిచి ఉంచుతామని శ్రీకాళహస్తి ఇఓ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సూర్యగ్రహణం రోజు తెరిచి ఉంచే ఆలయం ఇదేనని, గ్రహాలకు అతీతుడు ముక్కంటీశ్వరుడు అన్నారు. ఆలయంలో భక్తులకు మహాలఘదర్శనం అమలు చేస్తున్నామని, ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, రాహు, కేతు పూజలు కొనసాగుతాయన్నారు.

ఇటు కర్నూలు జిల్లా శ్రీశైలంలో సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ఆలయద్వారాలు తెరిచి, ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయాలు, సాక్షి గణపతి, హటకేశ్వరం ,పాలదార, పంచదార, శిఖరం ,ఉపాలయాణాలు కూడా మూసివేసి 21వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు.కొమురవెల్లి మల్లికార్జునస్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, భద్రకాళి దేవాలయం, వెయ్యి స్థంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరభద్రస్వామి దేవాలయం, పాలకుర్తి సోమనాథ ఆలయాలను మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అన్ని చార్‌ధమ్‌ ఆలయాలను (బద్రీనాథ్‌, కేదరీనాథ్‌, గంగోత్రి, యుమునోత్రి) శనివారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు మూసివేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget