ప్రపంచ దేశాలపై కరోనా విభృంభణ కొనసాగుతూనే ఉంది. మొదటితో పోలిస్తే పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా అదుపులోకి రావడంలేదు. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81.07 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్ బారినపడి 4.38 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 41.87 లక్షల మంది కోలుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌లో కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
- అమెరికాలో 21,82,548 పాజిటివ్ కేసులు, 1,18,279 మంది మృతి
- బ్రెజిల్‌లో 8,91,556 పాజిటివ్ కేసులు, 44,118 మంది మృతి
- రష్యాలో 5,37,210 పాజిటివ్ కేసులు, 7,091 మంది మృతి
- ఇంగ్లండ్‌లో 2,96,857 పాజిటివ్ కేసులు, 41,736 మంది మృతి
- స్పెయిన్‌లో 2,91,189 పాజిటివ్ కేసులు, 27,136 మంది మృతి
- ఇటలీలో 2,37,290 పాజిటివ్ కేసులు, 34,371 మంది మృతి
Post a Comment