దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో.. మహమ్మారి కట్టడికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్న షా.. రానున్న రెండు రోజుల్లో కరోనా టెస్టులు రెట్టింపు చేస్తామని.. ఆరు రోజుల్లో మూడు రెట్లకు పెంచుతామని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని కరోనా ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో 500 రైల్వే కోచ్ లతో 8,000 పడకలు సిద్ధం చేయనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. జూలై చివరి నాటికి ఐదున్నర కరోనా కేసులు నమోదవుతాయని అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఢిల్లీలో 38,958 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Post a Comment