నెల్లూరు జిల్లాలో కోవిడ్ - 19 పరీక్షలను వెయ్యి నుంచి రోజుకి 2500 చేసేవిధంగా అదనంగా పరికరాలు అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం వి శేషగిరిబాబు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ రెడ్డిని కోరారు. మంగళవారం విజయవాడ నుంచి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్ లో జిల్లా కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు స్థానిక నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని డి ఈ ఓ సి కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 200 మందికి వసతి ఏర్పాటు చేస్తున్నామని, దాని స్థాయిని రెండు మూడు రోజుల్లో 500 మందికి పెంచడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి అదనంగా బయో సేఫ్టీ చాంబర్ అవసరం ఉంటుందని, ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కి జిల్లా కలెక్టర్ వివరించారు . జిల్లాలో కొన్ని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షల నిర్వహణ కు ట్రూ నాట్ మిషన్లు కోవిడ్ పరీక్షల సామాగ్రి అవసరం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి , డిఎం అండ్ హెహ్ ఓ రాజ్యలక్ష్మి వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు........................... ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ వారిచే జారీ చేయడమైనది.
Post a Comment