నెల్లూరుజిల్లాపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత 11 రోజుల నుండి పాజిటివ్ కేసులు గణనీయంగా వెలుగుచూస్తున్నాయి. రోజుకు పదికి పై చిలుకు కేసులు బయటపడుతున్నాయి. నిన్నటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 370 ఉండగా తాజాగా శుక్రవారం మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 385కి చేరింది. కొత్తగా నమోదైన 15 కేసుల్లో నెల్లూరు నగరంలో అత్యధికంగా ఉన్నాయి. దర్గామిట్ట ప్రాంతానికి చెందిన 5 మందికి, మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఒకరికి, పడారుపల్లికి చెందిన ఒకరికి, చిల్డ్రన్స్ పార్కు ప్రాంతానికి చెందిన మరొకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే రాపూరు మండలంలోని ఏపూరుకు చెందిన ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దుత్తలూరులో ఒకరికి, వెంకటాచలంలో ఒకరికి, కృష్ణపట్నం పోర్టులో బీహార్ నుండి వచ్చిన ఓ వ్యక్తికి, యూకోనగర్ కు వచ్చిన తిరుపతి వాసికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. శుక్రవారం వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 385 మంది కాగా వారిలో 5 మంది చనిపోయినట్లు, 245 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. మిగిలిన 132 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, ఇంకా 1246 మందికి సంభందించిన నమూనాల ఫలితాలు రావల్సి ఉందని డాక్టర్ రాజ్యలక్ష్మి ప్రకటించారు. జిల్లాలోని 9 క్వారంటైన్ సెంటర్లలో 492 మంది ఉన్నారన్నారు.
Post a Comment