108 అంబులెన్స్ ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ గుర్తుకురాలేదా? బీద రవిచంద్రయాదవ్

108 అంబులెన్స్ ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ గుర్తుకురాలేదా? -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు
బీద రవిచంద్రయాదవ్

తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ , పాశం సునీల్ కుమార్ లతో కలిసి విలేఖర్ల సమావేశంలో  బీద రవిచంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ.....

👉వైసీపీ ఏడాది పాలన  అవినీతి మయం... వైసీపీ నేతల దోపిడీ కి హద్దులు లేకుండా పోయింది.

👉 ఏడాది క్రితం వరకు అభినందనలకు , కేంద్ర ప్రభుత్వ అవార్డులకు అడ్రస్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు కుంభకోణాలకు చిరునామాగా మారిపోయింది.

👉రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజాధనాన్ని కాపాడుతున్నామని చెబుతూ.. దాని ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు..

👉108లో రివర్స్ టెండరింగ్ పిలవడం మర్చిపోయారా ?  లేక దోపిడీ ఆలోచనతో పక్కన పెట్టారా? అంబులెన్స్ ల నిర్వహణలో బీవీజీ సంస్థకు డిసెంబర్ దాకా గడువు ఉన్నప్పటికీ.. 116 జీవో ద్వారా కాంట్రాక్టును హుటా హుటిన ఎందుకు రద్దు చేశారు.

👉 రూ.307 కోట్ల రూపాయలను  108 అంబులెన్స్ కొనుగోళ్లకు ప్రభుత్వ పెద్దల కుటుంబాలకు ఇచ్చుకున్నారు..

👉గతంలో లక్షా 30వేలు ఇస్తుండగా.. నేడు లక్షా 78 వేలు గా పెంచారు , పాత అంబులెన్స్ లకు 2.21 లక్షలు ఇస్తున్నారు. అమలులో ఉన్న కాంట్రాక్టును ఎందుకు పక్కన పెట్టారు. రివర్స్ టెండరింగ్ ను ఎందుకు అమలు చేయలేదు..

👉108 సేవలు ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ అయితే.. ఆరోగ్యశ్రీకి ఎందుకు మార్చారు.

👉కుటుంబ సభ్యులకు అనుకూలంగా కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు .. మీరు జపం చేసే రివర్స్ టెండరింగ్.. గుర్తుకు రాలేదా.

👉 6 నెలల ముందే కాంట్రాక్టు రద్దు చేసి, ఎక్కువ రేట్లకు పెంచి ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

👉 డీజిల్, పెట్రోల్ ధరలను పెంచారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. నేడు మాట తప్పారు. అన్ని ధరలను పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం పెంచిన దాని కంటే అదనంగా రాష్ట్రంలో ధరలు పెంచారు.

👉2018లో కేంద్రం ధరలు పెంచినా  టీడీపీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించింది.

👉 రవాణారంగంపై ఏటా రూ.4వేల కోట్ల భారం పడుతోంది.  నేడు రవాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

👉 వైకాపా ప్రభుత్వ  అవినీతిపై కోర్టులు హెచ్చరిస్తున్నా, మీడియా వారిస్తున్నా... బెదిరింపులకు పాల్పడుతున్నారు.... ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు.

పై కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు తాళ్ళపాక అనురాధ, పాల్ శెట్టి , అన్నం దయాకర్ గౌడ్, ఖాజావలి, ఎస్టీ సెల్ రంగారావు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుమల నాయుడు, అమ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget