స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి రూ.400కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టడమే కాక విదేశాలకు చెక్కేశాడు మరొక వ్యాపారవేత్త. విజయ్‌మాల్యా, నీరవ్ మోడీల మాదిరిగా మరొకరు వందల కోట్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయిన వ్యక్తిని పట్టుకోవాలంటూ CBIను ఆశ్రయించింది ఎస్బీఐ. ఘటన జరిగిన నాలుగేళ్లకు ఫిబ్రవరి 25న కంప్లైంట్ చేసింది SBI. దీనిపై CBI వారం క్రితమే కేసు ఫైల్ చేసింది.
బాస్మతీ రైస్ ఎగుమతి చేసి సంస్థ అయిన రామ్ దేవ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆరు బ్యాంకుల నుంచి రూ.414కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టింది. SBIనుంచి రూ.173.11 కోట్లు, Canara Bank నుంచి రూ.76.09కోట్లు, Union Bank of India, రూ.64.31కోట్లు, Central Bank of India నుంచి రూ.51.31కోట్లు, Corporation Bank నుంచి రూ.36.91కోట్లు, IDBI Bank నుంచి రూ.12.27కోట్లు అప్పులు తీసుకున్నాడు.
SBIచేసిన ఫిర్యాదు మేరకు CBIకేసు ఫైల్ చేసింది. కంపెనీ డైరక్టర్లు అయిన నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీతలపై కేసులు ఫైల్ చేశారు. ఫోర్జరీ, చీటింగ్ వంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫైల్ చేసిన కంప్లైంట్ లో లిక్విడిటీ ప్రాబ్లమ్స్ లతో కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్ లను 27.01.2016నుంచి చెల్లించకపోవడంతో రూ.173.11కోట్లు అయింది.
ఇండియాలోని అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ.. 2016లో స్పెషల్ ఆడిట్ నిర్వహించింది. అకౌంట్లను తప్పుగా చిత్రీకరించడం, బ్యాలెన్స్ షీట్ తప్పుడు వివరాలు, చట్టవ్యతిరేకంగా తొలగించిన ప్లాంట్ల వివరాలు తెలుసుకుని లిస్ట్ అవుట్ చేసింది. ఇందులో భాగంగానే రామ్ దేవ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఆస్తులపై 2016 ఆగష్టు
, అక్టోబరు నెలల్లో ఇన్‌స్పెక్షన్ నిర్వహించింది.
Post a Comment