ప్రభుత్వ మద్యం దుకాణం వల్ల మా గ్రామానికి కరొన ముప్పు ఉంది...
దొరవారిసత్రం మండలం పూలతోట గ్రామంలో ఉన్నా ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద పూలతోట గ్రామస్థులు ఆందోళన చేస్తూ మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు అంటూ షాపు ముందు ధర్నాకు దిగిన గ్రామస్థులు.రెడ్ జోన్ ప్రాంతాల నుండి మద్యం కోసం పూలతోటలో ఉన్న ప్రభుత్వ మద్యం షాపు దగ్గరికి వస్తున్నారని దానివల్ల మా గ్రామానికి మా గ్రామ ప్రజలకు కరొన ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులు ఆందోళనలతో మద్యం దుకాణం నందు విధులు నిర్వహిస్తున్న సివిల్ అండ్ ఎక్సైజ్ పోలీసు అధికారులు షాపును మూసివేశారు. విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గ్రామస్తులకు సర్ది చెప్పి వాళ్ళ సమస్యను పూర్తిగా విని వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకుని మీకు న్యాయం చేసేలా మా పై అధికారులకు తెలుపుతామని తెలియజేశారు. ఎక్సైజ్ సీఐ రాకముందు సదరు గ్రామస్తులకు ఎక్సైజ్ అధికారులకు కాస్త వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పూలతోట గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో వాకాడు మండలం 18 కిలోమీటర్ల దూరం నాయుడుపేట రెడ్ జోన్లు ప్రాంతాలు ఉన్నాయి అని అక్కడ నుంచి మద్యం ప్రియులు మద్యం కోసం మా గ్రామానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి వెళుతున్నారని అంతే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడు నుండి కూడా మద్యం కోసం మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర వస్తున్నారని షాపు మా గ్రామం మధ్యలో ఉండటం వల్ల మాకు కరొన ముప్పు పొంచి ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసి వేయాలని వారు కోరారు.
Post a Comment
ఢిల్లీ లోజరిగిన ముస్లిం మత ప్రధానాలు కన్నా బ్రాందీ షాపు లువల్లజరిగే కరొన్నానే ఏకువా