అధికారులను విమర్శలు చేయడం సీఎం ను విమర్సే.. చేజర్ల

*కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్నా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి :మీ ముఖ్యమంత్రి పెట్టిన నిభందనలను అమలు చేస్తున్న  కలక్టరు, SP గారి పై విమర్శలు చేయడం అంటే మీ ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయడమే.
నీకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి నీకు ఇవ్వలేదనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా విమర్శలు*
కలెక్టరు,SP గారు ఏ సి రూముల్లో కూర్చొని బయటకు రావడము లేదన్నావు,మీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసమునుండి బయటకు వచ్చాడా!*
SP గారు ప్రసన్నకుమార్ రెడ్డి గారిని కట్టడి చేయక పోతే కోవూరు మరి శ్రీకాళహస్తి అయ్యేవుండేది*
మీ అంతర్గత రాజకీయాలకు కలెక్టర్,SP గారిని బలిచేయవద్దు*.         
ముఖ్యమంత్రి శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన నిభందలను అమలు చేస్తున్న జిల్లా కలెక్టరు,ఎస్పీ గారి పై కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు విమర్శలు చేయడము అంటే ముఖ్యమంత్రి ని విమర్శ చేయడమే నని, మీ అంతర్గత రాజకీయాలకు అధికారులను బలి చేయవద్దని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపానులు, వరదలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఇతరులు కానీ ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుచుకొని వారికి తోచిన సహాయం చేస్తారు,  కానీ కరోనా వైరస్ అనేదానికి మందు లేదని స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే దీనిని నివారించగలమని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయని, దాని ప్రకారం శాసనసభ్యులు కూడా స్వీయ నియంత్రణ లొనే ఉండాలి, ఆ నిభందలను ఉల్లింగించి సేవ పేరుతొ రోజు వందల మందికి వెంటేసుకొని తిరగటం ఎంత వరకు సమంజసమని,ఎవరయినా సహాయం చేయదలచిన దాతలు నేరుగా చేయరాదని, అధికారులకు అంద చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని,దానిలో భాగంగా నెల్లూరు లో శ్రీ నారాయణ గారు స్వంత నిధులతో  సరుకులు పంపిణీ చేయబోతే ప్రభుత్వం అడ్డుకోని వలింటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నదని,కానీ కోవూరు నియోజకవర్గములో రూల్స్ అన్ని నాకే తెలుసు అని చెప్పిన ప్రసన్నకుమార్ రెడ్డి గారు మాత్రం దాతల వద్ద దండి తన ఫోటో వేసుకొని పంచడము అంటే తమ ముఖ్యమంత్రి ఆదేశాలను దిక్కరించడము కదా,రాష్ట్ర ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ ఉల్లింగించడము తప్పు కదా,బుచ్చి లో జరిగిన కార్యక్రమము పై ఎస్పీ గారు చర్యలు తీసుకొని ఉండకపోతే కోవూరు మరో శ్రీ కాళహస్తి గా మరి ఉండేది వాస్తవం కాదా,కలక్టరు, ఎస్పీ గారు ఏ సి గదులలో కూర్చొని బయటకు రావడం లేదంటున్నావు,మీ ముఖ్యమంత్రి గారు ఈ 42 రోజులలో ఒక్కరోజైన గడప దాటి బయటకు వచ్చారా, మీ ముఖ్యమంత్రి చేసినది తప్పు కానప్పుడు,కలక్టరు, ఎస్పీ గార్లది ఎలా తప్పు అవుతుంది,నీ కంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి నీకు మంత్రి పదవి ఇవ్వలేదనే కోపంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేక కలక్టరు,ఎస్పీ గర్లను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నట్లు ఉందని,ఒక వైపు మీ మంత్రలు ఏమో  కలక్టరు,ఎస్పీ గారు సమర్థవంతంగా పని చేసి కరోనాను అరికట్టగలిగారని అంటుంటే నీవు మాత్రం విమర్శలు చేస్తున్నావని, మీ అంతర్గత రాజకీయాలు కు అధికారులను బలిచేయవద్దని,జిల్లా కలెక్టర్లు, ఎస్పీ గారుకి వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రసన్నకుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ముఖ్యమంత్రి గారే ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి,దారా విజయబాబు, ఇంటూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget