గ్రీన్ జోన్ గా కోట మండలం ఉన్న నేపథ్యంలో ఒకసారిగా విద్యానగర్ ప్రకాశం కాలనీలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా వ్యహరించి ప్రకాశం కాలనీ, విద్యానగర్ ప్రాంతాల్లో అనుమానితులను గూడూరు క్వారం టైన్ కు తరలించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు, అక్కడ వారిని క్వారం టైన్ ఉంచారు, వా కాడు సి ఐ నరసింహ రావు ఆదేశాలు మేరకు కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు, కాలనిలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా విధులు మూసి వేశారు, అదేవిధంగా పంచాయతీ, వైద్య బృందాలు క్లోరేషన్ పనులు చేపట్టారు, వైద్య బృందం వారు కాలనీ లో ఇంటి ఇంటికి కరోనా పరీక్షలు నిర్వహించారు, గూడూరు సబ్ కలెక్టర్ రొనంకి గోపాల్ కృష్ణ రెవెన్యూ అధికారులు తో కలిసి కాలనీలో పర్యటించారు, అనంతరం కంటోన్మెంట్, బఫున్ జోన్లు గా ప్రకటించి పలు చర్యలు చేపట్టారు, ఇంతలోనే విద్యానగర్ మరో పాజిటివ్ కేసు నమోదు అయినట్టుగా సమాచారం, అయితే అధికార యంత్రాంగం రోజు వారీ బులెటిన్ లో అధికారికంగా ప్రకటించనున్నారు, దింతో మండల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు, ఇది ఇలా ఉంటే అధికార యంత్రాంగం మాత్రం ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలు బయటకు తిరగవద్దు అంటే వేడుకుంటున్నారు, ప్రజలు మాస్కలు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు,
Post a Comment