హోమ్ అప్లియన్స్ షాపులు కు అనుమతి ఇవ్వాలి... నరసింహారెడ్డి



    నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నిర్మలs నరసింహ రెడ్డి కలెక్టర్ గారిని, జిల్లా SP ని  హోమ్ అప్లయన్సెస్ షాపులు తెరిచేందుకు అనుమతి కోరుతూ.. ఈ క్రింది విధంగా అభ్యర్దించినారు.

మా షాపులు తెరిచేందుకు అనుమతి కొరకు మా అభ్యర్ధనను తెలిపేందు కన్నా ముందుగా కోవిద్ 19 సందర్భంగా జిల్లాలో మీ ఆధ్వర్యంలో ప్రజలకు సేవచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు  హృదయ పూర్వక అభినందనలు, కృతజ్ఞతలు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలుపు తున్నాను. మార్చ్,  22 తేదీ నుంచి నేటి వరకు మీరంతా అందిస్తున్న సేవలను ఘనంగా కీర్తించు చున్నామని తెలిపినారు. 

ఎండ తీవ్రత ముదురుతున్న ఈ తరుణంలో గతంలో మేము అమ్మిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల సర్వీసింగ్ కొరకు, రిపైర్ వర్కుల గురించి వందల ఫోనులు వచ్చుచున్నవి. కానీ మేము కరోనా నిబంధనల వలన మా టెక్నికల్ వర్కర్లను పంపలేకున్నాము. దాని వలన మా ఖాతాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు ఉన్నవారు మరీ అసౌకర్యం పొందు తున్నారు. 

అది మాత్రమే కాక మా వర్కర్స్ కు పనిలేక, కుటుంబాల్ని పోషించలేక ఎంతో అవస్థ పడుతున్నారు. వారంతా ఈ వృత్తినే నమ్ముకున్నారు. మీరు దయతో మాకు అనుమతిస్తే,  ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజెర్లను ఉపయోగిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజల అవసరాలకు  పనిచేయిస్తా మన్నారు  

కొత్త హోమ్ అప్లియన్సు (AC లు, కూలర్లు) కొరకు మమ్ములను  ఫోనులలో ఎందరో  కొనుటకు అడుగుచున్నారు. మీరు దయతో అనుమతిస్తే ఉదయం 6 నుంచి 9గంటల లోపు,  కోవిద్-19 నిబంధనలు కచితంగా పాటిస్తూ నెల్లూరు ప్రజలకు అందించగలమన్నారు.
 
GST రూపంలో గవర్నమెంటుకు 24% పన్ను కట్టి ఆదాయాన్ని అందించే మా అభ్యర్ధనను పై అధికారులు దయతో పరిశీలించి అనుమతి అందించగలరని ఆశిస్తూ.. మీ ఘనమును మిక్కిలి కీర్తించు చున్నామన్నారు

దీని గురించి  గౌరవ నీయులు రాష్ట్ర మంత్రి  శ్రీ అనిల్ కుమార్ ని, జిల్లా కలెక్టర్ ని, జిల్లా SP ని సంప్రదించటం జరిగిందని తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget