సర్వేపల్లి రాజకీయాలకు టార్చ్ బేరర్" మూసపోత రాజకీయాలకు నూతన ఒరవడి

సర్వేపల్లి రాజకీయాలకు టార్చ్ బేరర్".

మూసపోత రాజకీయాలకు నూతన ఒరవడి

రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా సేవాకార్యక్రమాలు

.........................................................

స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతంలో ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయనాయకులు వచ్చారు, వెళ్లారు. అయితే వారిపరిధిలో వారు సేవాకార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. ప్రతిరంగంలో రెండు, మూడు దశాబ్దాలకొక పర్యాయం సమూలమార్పులు సంభవిస్తుంటాయి. ఆ మార్పులకు మార్గదర్శకంగా నిలబడి ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించే వారినే టార్చ్ బేరర్ అంటారు.

రాష్ట్ర రాజకీయాలను తిరగరాసి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి టార్చ్ బేరర్ గా నిలిచారు. జిల్లా రాజకీయాలతో పాటు సర్వేపల్లి రాజకీయాల్లో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో టార్చ్ బేరర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎందరో నాయకులను చూస్తూనే ఉన్నారు. అయితే వారిలో ప్రజలు కొందరిని గుర్తుంచుకుంటారు ఆ కోవకు చెందిన వారే ఎమ్మెల్యే గోవర్దన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించి పూర్తి చేశారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. రోగితో కాకుండా జబ్బుతో ఆయన పోరాటం చేశారు.

 నియోజకవర్గ ప్రజలను అన్ని జాగ్రత్తలు తీసుకోమంటూనే వారికి కూరగాయలతో పాటు, లక్షకుటుంబాలకుపైగా బియ్యం, వంటనూనెలను అందజేశారు. టి.పి.గూడూరు మండలం, సౌత్ ఆములూరు, ముత్తుకూరు మండలం మల్లూరు వంటి రెడ్ జోన్ గ్రామాలకు స్వయంగా వెళ్లి ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు.
60, 70 దశకాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కనిపించడం అరుదు. ప్రజలు వారికి కనిపించినా పనిచేసిపెట్టడం మహాఅరుదు. అప్పట్లో ఎమ్మెల్యే అంటే సాక్షాత్తు దైవాంశసంభూతుడు, బ్రహ్మ పదార్థంగా ప్రజలు భావించేవారు. అయితే ఇపుడు ఆ పరిస్థితులు లేవు. కాకాణిగారి వంటి ఎమ్మెల్యే లు ప్రజలు ఏ దిక్కున చూసినా కనిపిస్తూ రాజకీయ దశ, దిశను మార్చుకుతున్నారు. కాబట్టే ఎమ్మెల్యే కాకాణిగారు రాజకీయాల్లో టార్చ్ బేరర్ (దివిటి కూడా అనొచ్చు) అయ్యారు.

ఊహలకందని ఆలోచనలు చేసి వాటిని అమలు చేయడంలో ఎమ్మెల్యేకు కొట్టినపిండి. జెడ్పీచైర్మన్ గా నూతన పాలనా విధానానికి శ్రీకారం చుట్టినా, ఎమ్మెల్యేగా సేవాకార్యక్రమాలు చేపట్టినా ఆయనకు ఆయనేసాటి. రాజకీయాలు వ్యాపారంగా మారిన రోజుల్లో సైతం ప్రజలకు ఉపయోగపడేపనులు చేసేందుకు ఎమ్మెల్యే కాకాణిగారు నిరంతరం పరితపిస్తుంటారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లాక్ డౌన్ సమయంలో ఎమ్మెల్యే గారు చేపట్టిన రైతుల వద్ద ధాన్యం సేకరణ చరిత్రలో నిలిచిపోతుంది. కరోనాకు ముందు సర్వేపల్లి కరోనా తర్వాత సర్వేపల్లి అని చెప్పుకునేలా ఎమ్మెల్యే గారి పిలుపుకు రైతులు స్పందించారు.

 నియోజకవర్గంలోని పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, టి.పి.గూడూరు మండలాల నుంచి రైతులు 846 పుట్ల వడ్లు, 1,21,992 కిలోల బియ్యం, రూ.63,75,616 నగదు అందజేశారు. తామేమీ తీసిపోమని పామాయిల్ పరిశ్రమల యజమానులు ఈ మహా యజ్ఞంలో చేతులు కలిపి 82,500 లీటర్ల వంటనూనెను సమకూర్చారు. దీంతో పాటు ఎమ్మెల్యే గారు మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు, సంచులు, రవాణా, కవర్లు, నిత్యావసర సరకులకు తదితరాకు ₹1,03,00,800/- లు ( ఒక కోటి మూడు లక్షల ఎనిమిది వందల రూపాయలు) స్వంత నిధులను  ఖర్చు చేశారు.

ఎమ్మెల్యేగా తరచుగా ఆయన అనే మాట ''200 గ్రామాలు ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం తోడేరుకు (ఎమ్మెల్యే సొంతూరు) అవకాశం వచ్చింది, 2.20 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం నాకొచ్చింది, నాతండ్రి కాకాణి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే కాలేకపోయారు, ఆ వెలితి గ్రామంతో పాటు మాకుటుంబంలొ ఉండేది, అయితే నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యాను, ఇంతకంటే ఏంకావాలి ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి" అంటారు. ఈ మాటలు ఓ రాజకీయనాయకుడి నోట వెంట వినడానికి ఎంతగొప్పగా ఉంటుందో వింటేనే అర్ధం అవుతుంది.

ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి గారు రాజకీయాల్లో లివింగ్ లెజెండ్. పద్దెనిమిది ఏళ్లు పొదలకూరు సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 60వ దశకంలో రమణారెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారి అనుచరునిగా ఒక్క వెలుగు వెలిగారు. ఏసీ సుబ్బారెడ్డి గారు అప్పట్లో రాష్ట్ర హోమ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటి మంత్రి గా పనిచేశారు. నిండుసభలో ఏ.సి.సుబ్బారెడ్డి గారు ఈప్రాంతానికి నేను కాదు కాకాణి రమణారెడ్డి మంత్రి అని ప్రకటించారు. అయితే రమణారెడ్డి గారు దాన్ని అవకాశంగా తీసుకుని ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడింది లేదు. ఆయన వందలమందికి ఉద్యోగాలు ఇప్పించారు.

సర్వేపల్లి రైతన్నకానుక సేవా కార్యక్రమానికి పెద్దాయన నిండు మనస్సుతో తన మనుమరాళ్లు పూజితారెడ్డి, సుచిత్రారెడ్డిల ద్వారా తోడేరులో తన ఇంటి నుంచే 14 పుట్ల ధాన్యాన్ని అందజేశారు. రాజకీయాల్లో నిబద్దత, విశ్వసనీయత, పోరాట పటిమ ఎమ్మెల్యే గారు తనతండ్రి రమణారెడ్డి గారి నుంచే నేర్చుకున్నారు.

మరో సేవాకార్యక్రమం
.................................
ఎమ్మెల్యే గోవర్దన్ రెడ్డి గారు మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా 7,800 మంది ముస్లీం కుటుంబాలకు గోధుమ పిండి, నెయ్యి, సేమియా, పంచదార, నూనె ఐదు రకాల వస్తువులను తన సొంత నిధులతో అందజేయనున్నారు.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget