మహాజనసైన్యం అధ్యక్షులు సురేంద్ర గారు,నాగార్జున గారు మాట్లాడుతూ భారతదేశ సరిహద్దుల్లో నిత్యం గస్తీ నిర్వహిస్తూ, నిద్రాహారాలు లేకుండా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, పనిచేస్తున్న సైనికులకు ఏమాత్రం తీసిపోకుండా, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా భూతానికి భయపడకుండా ఆంధ్రపప్రదేశ్ ప్రజానీకానికి సేవచేస్తున్న సైనిక దళం, మన సామాజిక అవసరాలను తీరుస్తున్న వాలంటీర్స్ వ్యవస్థకు మహాజనసైన్యం(MJS) సలాం.సచివాలయ వ్యవస్థకు పునాధులుగా నిలుస్తున్న సామాజిక శ్రామికులు వీరు,నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజా సేవకులు వీరు,ప్రజల వద్దకు పాలన తీసుకొని వెళ్లే వారధులు వీరు, వీరి యొక్క శ్రమను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలి. అంతేకాకుండా నిత్యం ప్రజల సమస్యలపై అలుపెరుగని యోధుల్లా శ్రమిస్తూ,చాలీ చాలని జీతాలతో జీవితాన్ని కొనసాగిస్తూ అలుపెరుగకుండా ప్రజా శ్రేయస్సుకోసం పాటుపడుతున్న నిజమైన పాలకులు వీరు, వీరియొక్క సేవలు చిరస్మరణీయం,ప్రజలు ఇళ్లల్లో ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని వీరు గ్రామాల్లో తిరుగుతూ వారి యొక్క ఆరోగ్యాన్ని,ప్రాణాన్ని పణంగా పెట్టి అహర్నిశలు కష్టపడుతున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో సైనికుల్లా పనిచేస్తున్న వీరికి ప్రస్తుతం వేతనంగా పదివేల రూపాయలు తక్షణమే మంజూరు చేస్తూ వీరి జీవితాల్లో వెలుగులు నింపి,మరింతగా ప్రజా సేవలో నిమగ్నమయ్యేలా ఆంధ్రప్రేదేశ్ లో ఉండే ప్రతి వాలంటీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ,అదేవిధంగా నిరంతరం శ్రమ జీవనం కొనసాగిస్తూ సమయం,సందర్భం,కుటుంబాన్ని సైతం త్యాగం చేసి,పండుగలు,కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించి సామాజిక వ్యవసాయం చేస్తున్న సచివాలయ సిబ్బందిని సైతం వారి సేవలు గుర్తించి ఆంక్షలు లేకుండా త్వరిత గతిన పర్మినెంట్ చేయవలసిందిగా మనవి చేస్తూ, 2018 - పి.ఆర్.సి ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మహాజనసైన్యం(MJS).పై డిమాండ్ ను అమలు చేయాలని మార్చ్-24 నుండి సోషల్ మీడియాలో చేస్తున్న పోరాటానికి అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు వాట్సాప్ ద్వారా వినతి పత్రాలు సమర్పించటం జరిగింది,వారితో మాట్లాడటం కూడా జరిగింది.*ఈ డిమాండ్ కు అనుగుణంగా గ్రామ సచివాలయం,వార్డు సచివాలయం సిబ్బందికి 2018 పి.ఆర్.సి ని అమలు చేస్తూ,సర్వీస్ రిజిస్టర్ అమలు చేస్తూ (ఉద్యోగం పర్మినెంట్)చేస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నం ప్రారంభించటం హర్షించదగ్గ విషయం,అదేవిధంగా వాలంటీర్స్ కు కూడ నెలకు పదివేలు జీతం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా మహాజనసైన్యం(MJS) డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో మహాజనసైన్యం అధ్యక్షులు చేవూరు సురేంద్ర, ఉపాధ్యక్షుడు నాగార్జున గారు, ప్రవీణ్ కుమార్,యశ్వంత్, అఖీబ్, మధు పాల్గొన్నారు.
Post a Comment
Great service dear brothers