.02.05.2020న గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీ లలో Carona Virus నియంత్రణలో భాగముగాగత నెల22వ తేది నుండి ప్రత్యక పారిశుధ్య కార్యక్రమములు అనగా చెత్త కుప్పలు తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లింపు, మురుగు కాలువల పూడిక తొలగింపు, మంచినీటి ట్యాంకుల శుభ్రత, సోడియం హైపో ద్రవాల పిచికారి, ఫాగింగ్ మొదలగు పనులు యుద్ధ ప్రతిపదికన జరుగుతున్నాయి.
పారిశుధ్య కార్యక్రమములు నిర్వహించుటకు గాను అవసరమైన Bleeching Powder , Hi grade bleeching granuals కొనుగోలు చేసి సరఫరా చేయమని శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు వారి నిధులలో మంజూరు చేసియున్నారు , సదరు నిధులతో కొనుగోలు చేసిన సామగ్రిని జిల్లాలోని అన్ని మండలాలకు జనాభా ప్రాతిపదికన కేటాయించి MPDO ల ద్వారా మండలము లోని గ్రామ పంచాయతీలకు సరఫరా చేయడం జరిగినది.
పారిశుధ్య పనులలో భాగముగా గ్రామాలలో Carona Virus నియంత్రణలో భాగముగా మరియు గ్రామాలలో పరిశుభ్ర వర్తవరణం కొనసాగింపు కొరకు శ్రీయుట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలలో ఒక విడత సోడియం హైపోక్లోరైడ్ ద్రవం తేది.02.05.2020న పిచికారి చేయమని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించడమైనది, సదరు ఆదేశాలనుసారం జిల్లాలో ఈ రోజు గ్రామ పంచాయతీలలో MPDO మరియు EOPR &RD ల పర్యవేక్షణలో పంచాయతి కార్యదర్శులు గ్రామ వీధులలో, ప్రభుత్వ కార్యాలయాలలో, మురుగు కాలువలపై, అపరిశుభ్ర వాతావరణం గల అన్ని ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవం పిచికారి చేయడమైనది. ఇదే స్పూర్తిని కరోనా మహమ్మారి అంతమయే వరకు కొనసాగిస్తామని ఏదైనా గ్రామములొ వివిధ కరణముల చేత పిచికారి కార్యక్రమం జరగని గ్రామాలు ఉంటే వాటిని గుర్తించి రెండు రోజులలో వెంటనే చర్యలు చేపట్టబడునని తెలియచేయదమైనది.
Post a Comment