పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు మద్దతుగా రాజకుటుంబీకులు సర్వజ్ఞ కుమార యాచేంద్ర

పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని శుభ్రం చేసిన


రాజకుటుంబీకులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు :

కరోన సంక్షోభంలో సైతం తమ ప్రాణాలను లెక్క చేయక నిరంతరం వెంకటగిరి పట్టణ ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న  మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు మద్దతుగా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉదయం రాజా వీధిలోని జెడ్పి బాలికోన్నత పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని తాను తన అభిమానులు శుభ్రం చేసినట్లు వెంకటగిరి సంస్థానాధీశులు,, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైయస్సార్ సిపి నాయకులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరం ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ, గృహ నిర్బంధంలో ఉండి, తప్పనిసరి అయితే తప్ప బజార్ కు వస్తూ, సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారి తో పాటు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ మదర్ శా ఆలి, వైయస్సార్ సిపి వెంకటగిరి పట్టణ అధ్యక్షులు  గుమ్మలపు ఢిల్లీ బాబు, సీనియర్ న్యాయవాది, లక్కమనేని కోటేశ్వరరావు, రాజా గారి అభిమానులు గొల్లగుంట వెంకట ముని, గొల్లగుంట మురళి, కొండూరు కోటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వరరావు, రమేష్, శ్రీధర్, మంగళపురి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మహిళా నాయకురాళ్లు శ్రీమతి ధనియాల రాధ, శ్రీమతి జలగం కామాక్షి, పూజిత మొబైల్ గంగాధర్, సాయి, వల్లబదాస్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget