పైలాన్ విధ్వంసం కు
పథకరచన చేసిన
జర్నలిస్టు ఎవరు❓
🔸ఫ్లెక్సీ ఏర్పాటుపైనే
దర్యాప్తు అధికారుల దృష్టి ❗
-----------------------–----------–----–--
కావలిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో
ఏర్పాటు చేసిన " పైలాన్ ( స్మారక చిహ్నం ) ఏప్రిల్ 11 వతేది అర్ధరాత్రి విధ్వంసం చేసిందెవరు ? అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకొని పోలీసు అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలియవస్తుంది . వారి దర్యాప్తులో భాగంగా కొద్ది రోజుల క్రితం కొందరు జిల్లాలోని వివిధ శాఖలకు చెందన పోలీసు ఉన్నతాధికారులు - కావలి వచ్చి విచారణ ప్రారంభించినట్లు వార్తలు వినవస్తున్నాయి . తీగ లాగితే డొంక కదులుతుందన్న రీతిలో వారు సంఘటనా స్థలంలో కట్టిన ఫ్లెక్సీ వివరాలు గురించి దర్యాప్తు చేసినట్లు ప్రచారం సాగుతోంది .
▪️ముందురోజు పైలాన్ ప్రజలకు కనపడకుండా చేసి - సంఘటనా స్థలంలో పైలాన్ కు అడ్డంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఎవరు ?
▪️జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ అనుమతి లేకుండా వారి ఫోటో ఫ్లెక్సీ పై ముద్రించడానికి సాహసం చేసిన జర్నలిస్టులు ఎవరు ?
▪️సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ అలాగే కావలి డివిజనల్ పోలీసు అధికారి దేవరకొండ ప్రసాద్ , కావలి తహసీల్దార్ దగ్గుమాటి రామకృష్ణ , కావలిలో పనిచేస్తూ ఇటీవలే బదిలీ పై నరసరావుపేట వెళ్లిన మునిసిపల్ కమీషనర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు లు - తమ ఫోటోలు ఫ్లెక్సీ మీద ముద్రించుకోవచ్చునన్న అనుమతి ఇచ్చారా ?
▪️ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ శంఖుస్థాపనకు విచ్చేయుచున్న అతిరథ మహారథులకు స్వాగతం .... సుస్వాగతమంటూ ఆహ్వానం పలికిన కావలి జర్నలిస్టులు ఎవరు ?
▪️ప్లెక్సీ రూపకల్పన చేసిన ఫ్లెక్సీ దుకాణం యజమాని ఎవరు ?
▪️ఫ్లెక్సీ తయారుచేయించిన వారి వద్ద నుండి అధికారుల అనుమతి పత్రాలు - ఫ్లెక్సీ తయారుచేసిన యజమాని తీసుకొన్నాడా ?
▪️ సబ్ కలెక్టర్ గాని - తహసీదారు గాని - అప్పటి మునిసిపల్ కమిషనర్ గాని ప్రెస్ క్లబ్ నిర్మాణం చేసుకోవచ్చని జర్నలిస్టులకు చట్టపరంగా రాజముద్ర వేసి ప్రభుత్వ స్థలాన్ని
" పట్టా " గా ఏమైనా ఇచ్చారా ?
▪️ కావలిలోని ఉన్నతాధికారుల్ని ముందురోజు ఏప్రిల్ 11 వతేది ప్రెస్ క్లబ్ శంఖుస్థాపన జరుగుతుందని ప్రత్యక్షంగా వెళ్లి ఆహ్వానించిన విలేకరి ఎవరు ? అతనితో వెళ్లిన జర్నలిస్టులు ఎవరు ?
▪️సంఘటనా స్థలంలో పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన సీ సీ కెమెరాల్లో విధ్వంసక చర్య దృశ్యాలు కనిపించకుండా - వాటిని నిర్మూలించింది ఎవరు ? అసలు సూత్రధారి ఎవరు ?
▪️విధ్వంస చర్య జరిపించిన జర్నలిస్టు ఎవరు ? అతనికి సహకరించిన వారిలో జర్నలిస్టులు వున్నారా ?
▪️కావలి 1 వ పట్టణ 2 వ పట్టణ పోలీసు స్టేషన్లలో నేరచరిత్ర ఏఏ జర్నలిస్ట్ కు వుంది ? ఆ కేసుల వివరాలేంటి ?
▪️తెలుగుదేశం జిల్లా అధ్యక్షలు బీదా రవిచంద్ర కావలి వచ్చి పైలాన్ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని - ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేస్తే - దానికి ప్రతిగా బీదా రవిచంద్రను విమర్శిస్తూ ఒక విలేకరి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలేంటి ? ఆ విలేకరే మొత్తం పైలాన్ ధ్వంసం ఎపిసోడ్ కు పాత్రధారా ?
▪️ ఆ ప్రెస్ మీట్ దృశ్యాలు యూ ట్యూబ్ లలో చిత్రీకరించి వాట్సాప్ లో పోస్ట్ చేసిన యూ ట్యూబ్ అధిపతులు ఎవరు ?
ఇలా పలు విధాలుగా నేర పరిశోధన విభాగం అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది .
జిల్లా నేర పరిశోధన విభాగం పోలీసు అధికారులు రహస్య దర్యాప్తు చేసిన విషయాలు అటుంచితే ......
ఈనెల 6 వతేది బుధవారం నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కావలి రాక సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా విలేకర్ల సమావేశం లో ఆయన పైలాన్ విధ్వసంపై చేసిన ఆరోపణలు కావలిలో తీవ్ర సంచలనం రేపాయి . పైలాన్ ధ్వంసం కేసును కొందరు అధికారులు ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది . పైలాన్ ధ్వసం జరిగింది టూ టౌన్ పరిధిలో వున్నందున ఆ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిఐ , ఎస్ఐ లపై చర్యలు గైకొని వారిని బలిపశువుల్ని చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తన అనుమానాన్ని సమావేశంలో వ్యక్తం చేశారు . ఆయన వ్యక్తం చేసిన అనుమానం కొత్త కోణాన్ని ఆవిష్కరింప జేసింది . పోలీసు అధికారుల్లో అయితే తీవ్ర కలకలం రేపింది . కావలి పట్టణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలయ్యేటట్లు చేసింది .
జిల్లా పోలీసు యంత్రాగం మాత్రం త్వరితగతిన ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమై వున్నట్లు - ఇటీవల వారు కావలి వచ్చి జరిగిన విధ్వంస సంఘటన పై వివరాలు సేకరించడం చెప్పకనే చెబుతోంది .
పైలాన్ ధ్వంసం చర్యపై బీజీపీ , తెలుగుదేశం వత్తిళ్లే కాక - కేంద్ర ప్రభుత్వ వత్తిడికూడా వున్నట్లు బీజేపీ నాయకుడు భరత్ కుమార్ యాదవ్ చెప్పడాన్నిబట్టి తెలుస్తుంది . భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా పైలాన్ విధ్వంసక చర్యను గర్హిస్తూ - తగు చర్యలు వెంటనే గైకొనమని జిల్లా అధికారులను లిఖితపూర్వకంగా కోరినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు . దీన్ని బట్టి ఉపరాష్ట్రపతి లేఖ వత్తిడి కూడా జిల్లా యంత్రాగం పై పెరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది .

Post a Comment