లాక్ డౌన్ ఉన్నంతవరకు మౌనికా చారిటబుల్ ట్రస్ట్ పేదలకు అండగా ఉంటుంది.... ట్రస్ట్ ఛైర్మన్ మౌనికా రెడ్డి
రోజువారీ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నిరుపేదలు, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పనులు లేక కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని అన్నారు. వెంకటగిరిలో రోజువారీ కూలీలు చేసుకునే పేదలను గుర్తించి వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆమె అన్నారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు ప్రతిరోజూ మౌనికా చారిటబుల్ ట్రస్ట్ వెంకటగిరి ప్రాంత ప్రజలకు అండగా ఉంటుందని ఆమె అన్నారు. మల్లమ్మగుడి వీధిలోని చింతచెట్టు క్రింద నివశించే నిరుపేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. పేదలు అనుకున్నదానికన్నా ఎక్కువగా సహాయం కోసం రావడంతో సరుకులు సరిపోలేదు, దీంతో వచ్చిన వారిని కాళీ చేతులతో పంపించకుండా ఒక్కొక్కరికి 500 రూపాయల నగదు ఇచ్చి పంపారు. కళ్ళు కనిపించని వృద్దులకు ఆపరెషన్ చేయిస్తానని హామీ ఇచ్చి ట్రస్ట్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ప్రస్తుత విపత్కర సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని మౌనికా రెడ్డి కోరారు.
Post a Comment