నెల్లూరు ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఏది?


లోక్సభలో ఎంపీ ఆదాల వాగ్బాణమ్ 

ఆక్వా రాజధానిగా పేరొందిన నెల్లూరు జిల్లా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో మంగళవారం ప్రశ్నించారు. ఆక్వా రైతులు నష్టపోతున్న  విషయం మీ దృష్టికి వచ్చిందా?, వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందజేస్తున్న రైతు గిట్టుబాటు ధర కోసం ఏ విధమైన ప్రయత్నాలు చేశారని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మంగళవారం లోక్సభలో రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. అవగాహన చైతన్యాల తోనే ఆక్వా రైతులకు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. 70 శాతం మంది ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నది వాస్తవమేనని అంగీకరించారు. అయినప్పటికీ గిట్టుబాటు ధర నిర్ణయానికి పలు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తులపై పెట్టే ఖర్చు, లభించే నాణ్యత, పాటించే యాజమాన్య పద్ధతులు, వాతావరణ పరిస్థితులు దీనికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే డిమాండ్ సప్లై, అంతర్జాతీయ ధరల పరిస్థితి కూడా దీనికి దోహద పడుతుందని తెలిపారు. ఆక్వా రైతులకు స్థానిక మార్కెట్ పైన, ఇతర రాష్ట్రాల్లో ఉండే ఆక్వా ఉత్పత్తుల ధరల పైన అవగాహన ఉంటే వ్యాపారులు కుమ్మక్కైనా ఎటువంటి నష్టం జరగదని పేర్కొన్నారు .కష్టాలను ఓర్చి ఉత్పత్తి చేస్తున్న ఆక్వా రైతులకు  మద్దతుగా కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవ- సమగ్ర అభివృద్ధి పథకం కింద సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఆక్వా ఉత్పత్తి తర్వాత మార్కెటింగ్ చేసుకునేందుకు సహకారాన్ని అందజేస్తోందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆక్వా రైతులకు మద్దతుగా ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు కేంద్రప్రభుత్వం నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (ఎంపేడా)  ఆక్వా రైతులకు ఎగుమతుల ద్వారా మంచి ధర అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొనుగోలు అమ్మకందారుల సమావేశాల నిర్వహణ, ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ధరల సమాచారాన్ని రైతులకు తెలియ పరుస్తుందని తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget