నేటి ఆధునిక ప్రపంచంలో ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునే వరకూ కాలంతోపాటు పోటీగా మన జీవన ప్రయాణం సాగుతుంది. భాద్యతలు, పూర్తి చేయాల్సిన లక్ష్యాలు, ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో మానసిక ఒత్తిడికి లోనై తద్వారా గుండె పై పడే భారం గురించి ఆలోచించే సమయం లేక, అనుక్షణం కుటుంబం కోసం పరితపించే కుటుంబ పెద్ద, గుండె భద్రతకు ప్రాధాన్యమివ్వడం లేదు. అంతే కాకుండా వ్యాయామం లేక, ఆమోదయోగ్యం కాని ఆహారపు అలవాట్లుతోడై గుండె వ్యాధికి కారణభూతాలొతున్నాయి. గుండెపోటు తీవ్రమైన సమస్య, సకాలంలో స్పందించకపోయినా, సరియైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా,
ప్రాణాంతకంగా మారి, కుటుంబానికి దూరం చేస్తుంది. అన్ని సార్లు లక్షణాలు కనిపించకపోవచ్చు. హెచ్చరికలు ఉండకపోవచ్చు. అలా అని నిర్లక్ష్యం చేయకుండా గుండె ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించండి, ఎందుకంటే మీ కుటుంబానికి మీరే ఆసరా కాబట్టి. ఇందులో మహిళలు కూడా మినహాయింపు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలు కూడా కుటుంబ అదనపు భాద్యతలు మోస్తున్నారు. గుండె జబ్బుల సమస్యలు అంటే కలవరపడే ఈ రోజుల్లో, అమూల్యమైన మీ ఆరోగ్య భవిష్యత్తు కోసం నారాయణ హాస్పిటల్ మీకు తోడుగా, ప్రాముఖ్యమైన గుండె హెల్త్ చెకప్ ను అందిస్తుంది. ఈ హెల్త్ చెకప్ మార్చి నెల 16వ తేదీ
నుంచి ఏప్రియల్ నెల 15 తేది వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ చెకప్ నందు గుండె వ్యాధి నిపుణుల కన్సల్టేషన్ తోపాటు రక్త శాతం నిర్ధారణ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరమ్ క్రియాటినిన్, టోటల్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్, టిజిఎల్, ఈజిజి, 2డి-ఎకో, వైరల్ స్క్రీనింగ్ (యాంజియోగ్రామ్ అవసరమైన వారికి హెచ్‌ఐవి. హెచ్‌బిఎస్‌ఏఆర్‌ఐ హెచ్‌సివి) తదితర పరీక్షలన్నీ కూడా కేవలం రూ. 499లకే అందించడం జరుగుతుంది. అంతే కాకుండా పై పరీక్షలలో ఎవరికైనా యాంజియోగ్రామ్ అవసరమని కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తే, యాంజియోగ్రామ్ తోపాటు అందుకు అవసరమైన వైద్య పరీక్షలతో సహా ఉచితంగా అందించే విధంగా ఈ చెకప్ ద్వారా ముందుకొచ్చాం . నారాయణ హాస్పిటల్ ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ చెకపను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యాంజియోగ్రామ్ నిర్వహణ భారతదేశంలోనే అత్యంత అధునాతన ఎఫ్‌డి-20 క్లారిటీ క్యాథలాబ్ ద్వారా నిర్వహించబడును. మరియు 24 గం||లు నిపుణులైన గుండె వ్యాధుల వైద్యుల పర్యవేక్షణలో నిరంతరం సేవలందించడం జరుగుతుంది. గుండె వ్యాధి లక్షణాలు ఉన్నవారు మరియు 35 సం||ల వయస్సు పై బడిన వారు అందరూ కూడా ఈ చెకప్ ను సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరుతున్నాం. ఇందుకు ఒక ప్రత్యేక హెల్ప్ డెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెస్క్
ద్వారా 7331170063 నంబరుకు ఫోన్ ద్వారా సంప్రదించి, తప్పనిసరిగా అపాయింట్ మెంట్ తీసుకొనవలెను, అపాయింట్ మెంట్ తీసుకున్న వారు ఉదయం 8.30 ని||ల లోపల స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ హెల్ప్ డెస్క్ నందు తమ అపాయింట్ మెంట్ ను నిర్ధారించుకొనవలెను. యాంజియోగ్రామ్ నందు ఏదైనా సమస్యలు గుర్తించనచో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితం వైద్య చికిత్సలు అందించబడును. ఇందుకోసం తమవెంట ఆధార్ మరియు ఆరోగ్యం కార్డు తెచ్చుకొనవలెను. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈవో డా॥ ఎస్.సతీష్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ బిజు
రవీంద్రన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా॥ కె.వెంకట శివకృష్ణ, డా॥ రెడ్డి భాషా, ఏజీఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment