వెంకన్నపాలెం లో విద్యార్థులకు అవగాహన సదస్సు
కోట మార్చి 7.
కరోనా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే వైరస్ దరిచేరదని కోట మండలం వెంకన్న పాలెం గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ కోరారు. శనివారం మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యాప్రదాత, ఉత్తమ అధ్యాపకుడు, స్వర్గీయ వెంకటేశ్వరరావు గారి మనుమడు శ్రీ అండ్ శ్రీమతి ముప్పవరపు సాయి సుమంత్ మలేషియా విదేశీయాన శుభ సందర్భంగా పాఠశాల విద్యార్థు లు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కరోనా వైరస్ పై అవగాహన కల్పించి ఫౌండేషన్ నిర్వాహకులు అందజేసిన హోమియో మందులను విద్యార్థులకు ఉపాధ్యాయులకు చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఎం వి రావు పౌండే షన్ శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ .ఉపాధ్యాయులు మంజుల,కృష్ణవేణి, విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి అనంతరం హోమియో మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, విద్యార్థులు .గ్రామస్తులు .పాల్గొన్నారు..
Post a Comment