మృత్యువుతో పోరాడుతున్న ఒక్కగానొక్క కుమారుడు.
రెండు కిడ్నీలు పనిచెయ్యవని అంటున్న వైద్యులు.
ఆర్థిక ఇబ్బందుల్లో నిరుపేద దళితురాలు.
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు..
మర్రిపాడు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. కళ్లముందే కొడుకు మృత్యువుకు చేరువవుతూ ఉంటే.. చూస్తూ మౌనంగా రోదిస్తోంది. ఆర్థిక సమస్యల భారంతో తామేమీ చేయలేని అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళితే..
మర్రిపాడు మండలం ,భూదవాడ పంచాయితీ బెడుసుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దలితురాలు కుంటా ఆదెమ్మ భర్త శేఖర్ దంపతులకు నలుగురు సంతానం వీరిలో ముగ్గురు కుతురులు కాగా ఒక్కగానొక్క కుమారుడికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు ఇలాంటి పరిస్థితి రావడం ,ఆడపిల్లలు పుట్టారని ఐదు సంవత్సరాల క్రిందటే భర్త ఆమెను వదిలి వెళ్లిపోవడం ఆమెను నిలువునా కృంగదీసింది.కొన్ని నెలల క్రితం తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురై. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. ఆత్మకూరు సుధాకర్ రెడ్డి హాస్పటల్ లో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నెల్లూరు సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బిడ్డకు కిడ్నీ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్సతోనే అతని జబ్బు నయమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాక పది రోజులు అక్కడే ఉండి చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు.వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యంకోసం
మద్రాసు ప్రభుత్వాస్పత్రిలో చేస్తారంటూ అక్కడకు సిఫారసు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును చూసుకోవడంతో నెలలుగా కూలికి పోవడం మానేసింది దీంతో అమె రోజు వారి సంపాదన రూ. 100 కొండెక్కింది. ఆదెమ్మ ఇటీవల కొన్ని రోజులుగా కుమారుడి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఇలాంటి తరుణంలో కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు అపన్నుల హస్తం కోసం ఎదురు చూస్తోంది లక్షలు సమకూర్చుకోవడంలో వారికి తలకు మించిన భారంగా మారింది. కళ్ల ముందే మృత్యువుకు చేరవవుతున్న కుమారుడిని చూస్తూ రోదించని రోజంటూ లేదు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం నిరుపేద కుటుంబం ఎదురు చూస్తోంది. పేదవాడికి రాకూడని ఆ జబ్బు ఆ పేద బిడ్డ పై పంజా విసిరింది పూట గడవడమే కష్టమైన ఈ కుటుంబానికి అధికంగా డబ్బు చెల్లించే ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేదు అయితే ఆ వ్యాధికి పేదవారు గొప్పవారని తెలుస్తుందా విధి ఆడే వింత నాటకంలో అందరూ పాత్రధారులే సూత్రధారి ఆపైవాడే ఈ జీవన తరంగాలలో అందరూ ఎవరికి వారు వారి పాత్రను వారు నిర్వహించాల్సిందే పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకోసం ఆ తల్లి పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు చెట్టు కు కాయలు బరువు తాయా అన్నట్లు తన కన్న బిడ్డలను కూలినాలి చేసుకుని ఆ మహిళ బ్రతికించుకుంటుంది ఇటువంటి స్థితిలో దాతలు మనసున్న మంచి మనసులు ఆ పేద బిడ్డపై దయచూపి వైద్యానికి అయ్యే ఖర్చును మానవతా దృక్పథంతో చేయూతనివ్వాలని బాధితురాలు ఆవేదన చూసిన వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం ఇప్పించి తన బిడ్డను బతికించాలి అని బాధిత మహిళ కుంటా ఆదెమ్మ అధికార పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తుంది ఆమె విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రాణాపాయం నుంచి కుమారుడిని ఎలా గట్టెక్కించాలో అర్థం కాక బరువెక్కిన హృదయాలతో బస్కు ఎక్కి సొంతవూరు మర్రిపాడు మండలం బెడుసుపల్లి గ్రామానికి చేరుకుంది.
సాయం చేయదలిస్తే..పేరు : కుంటా ఆదెమ్మ.w/o శేఖర్
బ్యాంక్ ఖాతా : 869110110002181
ఐఎఫ్‌ఎస్ కోడ్ : bkid000869
బ్యాంక్ పేరు : Bank of India. kumpasamudram
అదనపు సమాచారానికి కుంటా. ఆదెమ్మ ఫోన్..
9676153302.
Post a Comment