నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని అన్నారు. పోలీసులే ఏకంగా రంగంలోకి దిగారు..ఎలాంటి కేసులు లేని నాయకులను కూడా పోలీసుస్టేషన్ కు రమ్మని బెదిరిస్తున్నారు..ఎస్సైలు తమ ఫోన్లతో పాటు కానిస్టేబుళ్ల ఫోన్ల నుంచి టీడీపీ అభ్యర్థులకు, నాయకులకు ఫోన్ చేసి నామినేషన్లను విత్ డ్రా చేసుకోమని బెదిరించడం దుర్మార్గం..జిల్లా ఎన్నికల పరిశీలకులకు మేం ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం..పొదలకూరు, మనుబోలు పోలీసుస్టేషన్లకు సంబంధించి ఫోన్ కాల్ డేటా పరిశీలించండి..అక్కడి ఎస్సైలు ఏం చేస్తున్నారో తెలుస్తుంది..పొదలకూరు బిట్-3 టీడీపీ అభ్యర్థి ఆదాల సుగుణమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే ఆమె ఇంటి వద్ద గది కూలుస్తామని ఓ వైపు సచివాలయం సిబ్బంది బెదిరిస్తారు..
మరోవైపు పొదలకూరు ఎస్సై ఆమె కొడుక్కి ఫోన్ చేసి నామినేషన్ విత్ డ్రా చేసి చేసుకోమని, వెళ్లి వైసీపీ నేతలను కలవమని బెదిరిస్తాడు...ఇంతటి ఘోరమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదు..ఆక్రమణలు కూల్చుకోండి..మాకు అభ్యంతరం లేదు..ఒక వరుస క్రమంలో అందరివి తొలగించండి..మా అభ్యర్థి ఇంటి వద్ద మాత్రమే కూల్చడం తగదు..
తడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మత్స్యకార నేత శ్రీధర్ ను స్టేషన్ కి ఎందుకు పిలిచారో చెప్పాలి..ఎన్నికల పరిశీలకులు స్పందించి పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం..
పెళ్లకూరు మండలంలో జరిగిన దౌర్జన్యాలను అందరూ చూశారు..ఎంపీటీసీ అభ్యర్థల నామినేషన్లను చించేశారు..నామినేషన్ వేయడానికి బయలుదేరిన జెడ్పీటీసీ అభ్యర్థిని మధ్యలో తీసుకెళ్లిపోయారు..ఇదేంటని ప్రశ్నించడానికి వెళ్లిన మాజీ మంత్రి, దళితనేత పరసా రత్నం కారును ధ్వంసం చేశారు..ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి పెళ్లకూరు మండలంలో ఎన్నికలు వాయిదా వేయాలి..మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలి..
మాజీ మంత్రి, మాజీ మేయర్ల ఫోన్లు ఎత్తడంలో జిల్లా ఎస్పీకి ఉన్న ఇబ్బందులేమిటో...మా వ్యక్తిగత పనుల మీద ఆయనకు ఫోన్లు చేయం...లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతేనే చేస్తాం..మా ఫోన్లే ఎత్తకపోతే ఇక సామాన్యులు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి...దురదృష్టకరమైన పరిస్థితి ఇది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు రక్షణ కల్పించని విషయంలో సాక్షాత్తు డీజీపీ హైకోర్టు మెట్లు ఎక్కి చీవాట్లు తినాల్సివచ్చింది..నెల్లూరు జిల్లా పరిస్థితులపైనా మేం చూస్తూ ఊరుకోబోం..న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం..
Post a Comment