రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని.. దీనిని మిల్లర్లు గమనించాలని జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రైస్, మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లపై.. కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రభుత్వ తీసుకున్న చర్యలతో పాటు.. వర్షాలు సకాలంలో కురవడం వల్ల ధాన్యం దిగుబడులు అధికంగా ఉన్నాయని.. అందువల్ల మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. మిల్లుకు అమ్ముకోవడానికి ధాన్యం తీసుకవచ్చిన రైతులను కొందరు మిల్లర్లు ఉద్దేశ పూర్వకంగా రోజుల తరబడి వెయిట్ చేస్తున్న కొన్న ఘటనలు తన దృష్టికి వచ్చాయని.. దీనిపై ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వానికి తాము తప్పకుండా సహకరిస్తామని మిల్లర్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా తమకు సహకారం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం తరఫు నుంచి తాము తప్పకుండా సహకరిస్తామన్నారు.179 ధాన్యం కొనగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే.. 4,106 మంది రైతుల నుంచి 61131 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని డి.సి.ఓ బాలకృష్ణ, కలెక్టర్ కి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైస్ మిల్లర్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post a Comment