మంగళవారం నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీకి ఓటేసితప్పుచేశామనే బాధ ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు.ఎన్నికల సమరానికి టీడీపీ ఎప్పుడైనా సిద్దమేనని..డీ-లిమిటేషన్ సరిగ్గా లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించామన్నారు.వైసీపీకి అనుకూలంగా డివిజన్లను విభజించారన్నారు.ఈవీఎంలను మార్చేసి గెలిచినట్లు.. డివిజన్లను విభజించి గెలవాలనుకున్నారు.న్యాయం కోసం టీడీపీ కోర్టు మెట్టెక్కిందని తెలిపారు. గందరగోళాల మద్య సరిహద్దులను విభజించారని పట్టపగలే దొంగతనం చేసినట్లుందని కోర్టు వ్యాఖ్యానించినా.. వైసీపీ నేతలకు బుద్దిరావడంలేదని విమర్శించారు..ఇష్టప్రకారం రిజర్వేషన్లు ప్రకటించారు.. టీడీపీ బలంగా ఉన్న ప్రతి డివిజన్ ను చీల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ కార్పోరేషన్ ను కైవసం చేసుకోకూదనే దురుద్దేశ్యంతో వైసీపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు.
Post a Comment