నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా తొలి పాజిటివ్ కేసు నెల్లూరులో నమోదైంది..రెండో కేసు కూడా పాజిటివ్ గా రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది..మరోవైపు పదుల సంఖ్యలో శాంపిల్స్ ని ఫుణేకు ల్యాబ్ కి పంపివున్నారు..కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు..పలు రాష్ట్రాల్లో కళాశాలలు, హోటళ్లు, సినిమా హాళ్లను మూసేయడంతో పాటు పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు, ఉత్సవాలు, జాతర్లను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు..ఒకటి, రెండు కరోనా కేసులు నమోదైతేనే ఒక్కో రాష్ట్రంలో మొత్తం స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు మూసేశారు.రాష్ట్రంలో తొలి కేసులు నమోదైన నెల్లూరులో ఏం చర్యలు తీసుకుంటున్నారు..ప్రాణాంతకమైన కోవిడ్ 19 వైరస్ విస్తరిస్తుంటే కేవలం స్కూళ్లు, సినిమా హాళ్లు మూసేసి చేతులు దులుపుకుంటారా.అంటు వ్యాధి అయిన కరోనా విస్తరించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా..జనం ఇళ్లలో నుంచి కదలలేని పరిస్థితులు వస్తే అవసరమైన సహాయచర్యలు చేపట్టారా..ఇప్పటి వరకు జిల్లాలో డిస్ ఇన్ ఫెక్టివ్ ఫ్లూయిడ్లు, మాస్క్ లు సిద్ధం చేయలేదు..ఎన్నికల ఏర్పాట్లలో మునిగితేలుతున్న అధికారులకు కరోనా నివారణ చర్యలు పట్టవా.రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2 వేలకు పైగా బూతులలో సుమారు 23 లక్షల మంది ఓటు వేయడానికి గుంపులుగా వస్తారు...అప్పుడు పరిస్థితి ఏంటి..ఈ ప్రభుత్వానికి, అధికార యంత్రాగానికి, ఎన్నికల కమిషన్ కు జనం ప్రాణాలు పోయినా పర్వాలేదు..ఎన్నికలు జరిపి జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు పొందితే చాలుఅమెరికా లాంటి దేశమే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం రక్షణ చర్యలను గాలికొదిలేశారు.. ఎన్నికలకు మేం భయపడటం లేదు..ఓ వైపు రౌడీయిజం, దుర్మార్గం రాజ్యమేలుతోంది..అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..ఎన్నికలు వాయిదా వేయకపోతే..పోలింగ్ బూతుల వద్ద థెర్మో స్కానర్లు ఏమైనా ఏర్పాటు చేశారా..పోలింగ్ బూతుల వద్ద వందల మంది క్యూలలో నిలుచుంటే శానిటైజర్స్ ఏర్పాటు చేస్తున్నారా..మాస్కులు సిద్ధం చేశారా.ఢిల్లీలో కేజ్రీవాల్ ను చూసి నేర్చుకోండి..కరోనా వైరస్ వెలుగులోకి రాగానే ఢిల్లీ ఆస్పత్రులలో ఐసోలేటెడ్ చాంబర్లు ఏర్పాటు చేశారు..నిన్నటి వరకు కరోనా పెద్ద సమస్యే కాదన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నే షట్ డౌన్ చేసేందుకు చర్యలు చేపట్టారు.ఏపీలో ప్రభుత్వం మాత్రం నిద్రపోతుంది..నెల్లూరు జిల్లాలో కలెక్టర్ నుంచి బిల్ కలెక్టర్ వరకు ఎన్నికలే పరమావధిగా పనిచేస్తున్నారు..జనం ప్రాణాలు ఏమైనా వారికి పట్టేటట్టు లేదు..వైరస్ బారిన పడిన వారు ఎవరెవరిని కలిశారు..ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకుని వైరస్ విస్తరించకుండా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా..అధికారులు 24 గంటలూ ఎన్నికలు, స్క్రూటీనిలో టీడీపీ వారిని ఎలా ఎగరగొట్టాలి, బెదిరించి నామినేషన్లు ఎలా విత్ డ్రా చేయించాలనే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుస్టేషన్ల నుంచి ఔట్ గోయింగ్ కాల్ డేటా తీసుకోండి..టీడీపీ నేతలకు పోలీసులు ఎందుకు ఫోన్ చేస్తున్నారో ఉన్నతాధికారులు తెలుసుకోండి..నెల్లూరు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలి...పోలింగ్ తేదీలు మారితే ఇప్పుడు కొంపలు మునిగిపోవు.. ముందు వైరస్ విస్తరించకుండా ఆపి ప్రజల ప్రాణాలు కాపాడండి..కరోనా విస్తరించినా, ఇంకా కేసులు నమోదైనా ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం, ప్రభుత్వమే బాధ్యత వహించాలి..కోవూరులో ఓ అభ్యర్థి ప్రచారానికి పోతే కరోనా భయంతో ఆ ప్రాంతానికే రావద్దని ఆపేశారు..నేను ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ తోనూ ఫోన్ లో మాట్లాడాను..కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులను వివరించాను..ఎన్నికలు వాయిదా వేయాలని కోరాను...నామినేషన్లు, విత్ డ్రాయల్స్ అయిపోయాయి...ఇప్పుడు ఎన్నికల తేదీని వాయిదా వేస్తే కొంపలేం మునిగిపోవు..రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్న పరిస్థితుల్లో ప్రజలను ఇక ఆ దేవుడే కాపాడాలి.. ఈ సమావేశంలో అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, వెంకటస్వామి నాయుడు, జెన్ని రమణయ్య, ఖాజావలి, వెంకటేశ్వర్లు యాదవ్, ప్రదీప్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో నమోదైన కరోనా తొలి పాజిటివ్ కేసు

Post a Comment