చిట్టమూరు : చిట్టమూరు మండలం మల్లాం రెవెన్యూ సర్వే నంబర్ 126లో 4 ఎకరాల 42సెంట్లు ఉన్న భూమిలో కొన్ని సంవత్సరాలుగా మల్లామ్ రైతులు తమ పశువులను మేపుకొంటూ అక్కడే గడ్డివాములు వేసుకుంటూ( మందబయలుగా) వాడుకొంటున్నారు. గతములో రెవెన్యూ అధికారులు సదరు భూమిలో ఇందిరమ్మ ఇండ్లు, ఎన్టిఆర్ భరోసా క్రింద ఇండ్లు ఏర్పాటు చేసే విషయములో గ్రామ రైతులు అడ్డుక్కొని అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగనివ్వలేదు, ప్రస్తుతం సదరు భూమిని నవరత్నాలు పధకంలో అందరికి ఇల్లు అనే పధకంలో నివేశన స్థలాలకు కేటాయించడము జరిగినది దీనిని కూడా రైతులు అడ్డుకున్నారు, ఐతే చిట్టమూరు ఎమ్మార్వో పోలీసు బందోబస్తు సహాయముతో రెండు రోజుల క్రితం భూమిని జెసిబిలతో చదును చేయడం జరిగినది. ఈ విషయములో శుక్రవారం స్థానికులు, రైతులు తిరుమూరు అశోక్ (మాజీ ఎంపిటిసి)
ఆధ్వర్యంలో చిట్టమూరు ఎమ్మార్వో కార్యాలయంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతి పత్రం యిచ్చి భూమిని యధావిధిగా ఉంచాలని, ప్రభుత్వ స్థలాలు ఇతరులు అక్రమిస్తే పట్టించుకోకుండా ఉన్నారని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమురు చెన్నయ్య, రైతులు పాల్గొన్నారు.

Post a Comment