kovid పై అవగాహన సదస్సు.
చిట్టమూరు ఫిబ్రవరి 27.
స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ చేసిన సేవలు అజరామరం అని ,ఆయన పోరాట తత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, స్వాతంత్ర సమరయోధు లో ఆయన చేసిన సేవలు అజరామరం అని , ఎం వి రావు పౌండేషన్ ఛైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.గురువారం చిట్టమూరు మండలం గుణ పాడు దళితవాడలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోట మండలం చందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ వెంకటేశ్వరరావు జ్ఞాపకార్ధం ఆయన పేరిట ఏర్పాటయిన ఎం.వి. రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర పోరాటంలో ఆయన నిర్వహించిన పోరాట తత్వాన్ని ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని లీలామోహన కోరారు. అనంతరం చైనా దేశంలో విజృంభించి ఉన్న కరోనా వైరస్ kovid 19 పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ప్రతి విద్యార్థికి వ్యాధినిరోధక శక్తి ఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవని ప్రధానోపాధ్యాయుడు రమేష్ అన్నారు కావున ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే హోమియో మందులను వాడి ఆరోగ్యంగా ఉండాలని ప్రధానోపాధ్యాయుడు రమేష్ కోరారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,పౌండేషన్ నిర్వాహకులు, విద్యార్థులు.పాల్గొన్నారు.
Post a Comment